2030 నాటికి ఆడపిల్లలు తగ్గిపోతారట..
దేశంలో లింగవివక్ష కొనసాగుతోంది. ఆడపిల్ల అని తెలిస్తే కడుపులోనే చంపేస్తున్నారు. ఈ ఆబార్షన్ల వల్ల 2030 నాటికి భారత్ లో ఆడపిల్లల జననాల సంఖ్య 6.8 మిలియన్ల మేర తగ్గనున్నట్లు తాజా సర్వే వెల్లడించింది. దేశంలోనే ఉత్తరప్రదేశ్ లో పరిస్థితి దారుణంగా ఉంటుందని వివరించింది.
1970 నుంచి భారతదేశంలో లింగనిష్పత్తిలో చాలా అసమతుల్యత ఉన్నట్టు గుర్తించారు.లింగ నిర్ధారణపరీక్షలు, కుటుంబాల్లో మగ శిశువులకు ప్రాధాన్యత వంటి కారణాలతో ఈ పరిస్థితి తలెత్తినట్లు వెల్లడించింది. ఈ మేరకు సౌదీ అరేబియాలోని కింగ్ అబ్దుల్లా యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఫ్రాన్స్ లోని యూనివర్సిటీ డీపారిస్ పరిశోధకులు ఈ సర్వేలో తేల్చారు.
2017-2030 నాటికి ఉత్తరప్రదేశ్ లో 2 మిలియన్ల ఆడ శిశువుల జననాలు ఆగిపోయే అవకాశం ఉందని సర్వేలో తేలింది. మొత్తంగా భారత్ లో ఆడపిల్లల జననాల సంఖ్య 6.8 మిలియన్ల మేర తగ్గుతుందని తేల్చారు.
భవిష్యత్ లో భారత్ లో ఆడపిల్లలు దొరకకా మగాళ్లకు పెళ్లి కాని పరిస్థితి రావచ్చని.. కన్యాశుల్యం తిరిగి రావచ్చని సర్వే అంచనావేసింది. దీనికి కారణంగా మగబిడ్డనే కంటున్నారని.. ఆడపిల్లల పట్ల భారత్ లో వివక్ష కొనసాగుతోందని తేల్చింది.