వాటర్ పార్క్ దారుణం : ఆనందం ఆవిరైంది.. ఓ మహిళ జీవితాన్ని చిదిమేసింది..
ఈ ఘటనలో నిర్వహణలో నిర్లక్ష్యం ఉందా? లేక ఇది కేవలం ప్రమాదమా? అన్న దానిపై ఇప్పుడు చర్చ సాగుతోంది.;
పుణె సమీపంలో చోటుచేసుకున్న ఒక విషాదకర ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. పూణే వద్ద ఉన్న ఒక అగ్రో టూరిజం కేంద్రంలో జరిగిన వాటర్ స్లైడ్ ప్రమాదంలో 37 ఏళ్ల మహిళ అశ్విని సందీప్ నాప్తే తీవ్రంగా గాయపడి పక్షవాతం బారిన పడటం సంచలనంగా మారింది. కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా గడపాలని వెళ్లిన ఈ పర్యటన ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చేసింది.
సమాచారం ప్రకారం.. అశ్విని తన కుటుంబంతో కలిసి ఆ రిసార్ట్‌కు వెళ్లింది. అక్కడ ఏర్పాటు చేసిన వాటర్ స్లైడ్‌పై దిగుతున్న సమయంలో నీటి మట్టం సరైన స్థాయిలో లేకపోవడం వల్ల ఆమె స్లైడ్ చివరలో నేరుగా నేలపై బలంగా పడిపోయినట్లు తెలుస్తోంది. ఈ ఢీకొట్టడంతో ఆమె వెంటనే స్పృహ కోల్పోయింది. వెంటనే సమీప ఆసుపత్రికి తరలించగా వైద్యులు ఆమెకు తీవ్రమైన వెన్నెముక గాయాలు అయినట్లు నిర్ధారించారు. ఈ గాయాల ప్రభావంతో ఆమె శరీరపు కింది భాగం పూర్తిగా పనిచేయకుండా పోయింది.
ఈ ఘటనతో రిసార్ట్ భద్రతా ప్రమాణాలపై పెద్ద ఎత్తున ప్రశ్నలు లేవుతున్నాయి. వినోదం కోసం ఏర్పాటు చేసిన ప్రదేశాల్లో కనీస భద్రతా చర్యలు పాటించకపోవడం ఎంత ప్రమాదకరమో ఈ సంఘటన స్పష్టంగా చూపించింది. ముఖ్యంగా వాటర్ రైడ్స్ వంటి వాటిలో సరైన నీటి మట్టం, సాంకేతిక ప్రమాణాలు, శిక్షణ పొందిన సిబ్బంది అత్యవసర పరిస్థితులకు సిద్ధంగా ఉండే మెడికల్ సపోర్ట్ వంటి అంశాలు తప్పనిసరిగా ఉండాలి.
ఈ ఘటనలో నిర్వహణలో నిర్లక్ష్యం ఉందా? లేక ఇది కేవలం ప్రమాదమా? అన్న దానిపై ఇప్పుడు చర్చ సాగుతోంది. బాధ్యత వహించాల్సిన నిర్వాహకులు ఇప్పటివరకు సరైన వివరణ ఇవ్వకపోవడం కూడా అనుమానాలకు తావిస్తోంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు అధికారులు కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.
ఇకపోతే పర్యాటకులు కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని ఈ సంఘటన తెలియజేస్తోంది. ఉత్సాహంలో చాలా మంది రైడ్స్ వినియోగించే ముందు భద్రతా పరిస్థితులను పట్టించుకోరు. కానీ ప్రతి ఒక్కరూ తమ భద్రతను ముందుగా పరిగణలోకి తీసుకోవాలి.
మొత్తానికి ఒక సాధారణ కుటుంబ విహారం జీవితాంతం మరిచిపోలేని విషాదంగా మారింది. ఈ ఘటన భద్రతా ప్రమాణాల అమలులో లోపాలను వెలుగులోకి తెచ్చింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు కఠిన నియంత్రణలు, సమగ్ర తనిఖీలు అత్యవసరమని స్పష్టమవుతోంది.