ఆ దళితులకు రిజర్వేషన్ లేదు.. కేంద్ర ప్రభుత్వం సంచలన ప్రకటన!

Update: 2021-02-13 03:30 GMT
రిజ‌ర్వేష‌న్ల విష‌యంలో కేంద్ర ప్ర‌భుత్వం సంచలన ప్రకటన చేసింది. దళితులుగా ఉన్న‌వారు క్రైస్తవం, ఇస్లాం మతంలోకి మారితే రిజర్వేషన్లు కోల్పోతారని  పార్లమెంట్ సాక్షిగా స్పష్టం చేసింది ప్ర‌భుత్వం.  బీజేపీ సభ్యుడు జీవీఎల్‌ నరసింహారావు అడిగిన ఓ ప్రశ్నకు కేంద్రం ఈ వివరణ ఇచ్చింది. ఎస్సీ, ఎస్టీలుగా ఉన్నావారు.. క్రిస్టియ‌న్‌, ఇస్లాం మ‌తాల్లోకి మారితే రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్‌  కోల్పోతారని న్యాయ శాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్ ప్ర‌క‌టించారు.

ఎస్సీ, ఎస్టీల లిస్ట్‌లోని చాలా మంది మతం మారినప్పటికీ రిజర్వ్‌డ్‌ నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేలు, ఎంపీలుగా పోటీ చేస్తున్నారు. పదవులు కూడా పొందుతున్నారు. అలాంటి వారిని అనర్హులుగా పరిగణించేందుకు రాజ్యాంగ సవరణ చేసే అవకాశం ఉందా? అని న‌ర‌సింహారావు ప్ర‌భుత్వాన్ని ప్రశ్నించారు.

అలాంటిదేమీ లేద‌ని మంత్రి సమాధానం చెప్పారు. కానీ.. నామినేషన్ సమయంలో.. వారు మతం మారినట్లు పూర్తి సాక్ష్యాధారాలతో రిటర్నింగ్‌ అధికారులకు సమాచారం ఇస్తే.. వారి నామినేషన్ చెల్లుబాటు కాద‌ని చెప్పారు.మ‌తం మారిన దళితులు పార్లమెంట్ లేదా అసెంబ్లీ రిజర్వ్‌డ్ స్థానాల నుంచి పోటీచేయడానికి అర్హత లేదని మంత్రి చెప్పారు. అదేవిధంగా.. రాజ్యాంగం కల్పించిన ఇతర రిజర్వేషన్ ప్రయోజనాలు కూడా వర్తించవు అని మంత్రి స్పష్టం చేశారు.
Tags:    

Similar News