అక్కడ ఉప ఎన్నికలు.. కొత్త డేట్లు వచ్చాయ్!

Update: 2019-09-28 05:30 GMT
కర్ణాటక అసెంబ్లీ కి సంబంధించి పదిహేను స్థానాల ఉప ఎన్నికలకు కొత్త తేదీలను విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. ఇప్పటికే ఒకసారి ఆ ఉప ఎన్నికలకు సంబంధించి ఈసీ నోటిఫికేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే  ఆ నోటిఫికేషన్ ఈసీ రద్దు  చేసింది.

అనర్హత వేటుకు గురి అయిన ఎమ్మెల్యేల స్థానాలు ఖాళీ కావడంతోఈ ఉప ఎన్నికలు వచ్చాయి.  వారంతా కాంగ్రెస్ పార్టీ, జేడీఎస్ ల తిరుగుబాటు ఎమ్మెల్యేలు. వారిపై స్పీకర్ అనర్హత వేటు విధించారు. ఈ నేపథ్యంలో ఉప ఎన్నికలు వచ్చాయి. వారిపై అనర్హత వేటు వేయడమే కాకుండా..వారు ఎన్నికల్లో పోటీ కూడా చేయకుండా  స్పీకర్ నిషేధం విధించారు. అలా నిషేధం వేసి తన పదవికి రాజీనామా చేసి వెళ్లారు కాంగ్రెస్ నేత రమేశ్ కుమార్.

ఈ నేపథ్యంలో..ఉప ఎన్నికలు రానే వచ్చాయి. అయితే తమను ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించడం పట్ల ఎమ్మెల్యేలు కోర్టుకు వెళ్లారు. తమకు పోటీ చేసే హక్కును ఇవ్వాలని వారు కోరుతున్నారు. ఆ పిటిషన్ ను కోర్టు విచారణకు తీసుకుంది. దీంతో.. ఈసీ స్పందిస్తూ..విచారణ పూర్తయ్యే వరకూ ఎన్నికలను వాయిదా వేయడానికి అన్నట్టుగా నోటిఫికేషన్ ను రద్దు చేసింది.

అయితే ఇప్పుడు మళ్లీ వెంటనే మరో సారి నోటిఫికేషన్ జారీ చేసింది. తాజా నిర్ణయం మేరకు ఆ ఉప ఎన్నికలను డిసెంబర్ తొలివారంలో నిర్వహిస్తుందట ఎన్నికల కమిషన్. ఒకవేళ ఆ లోపు కోర్టులో అనర్హతకు గురైన ఎమ్మెల్యేల పిటిషన్ పై విచారణ లో వారికి అనుకూలంగా తేలితే ఓకే. లేకపోతే.. వారు పోటీకే అనర్హులు అవుతారేమో!
Tags:    

Similar News