వాలంటైన్స్ డే కి గిఫ్ట్ కొని సిద్ధంగా ఉన్నాడు.. ఈ లోపు షాకిచ్చిన ప్రియురాలు!

అవును... అవతలి వ్యక్తి ప్రేమను కొంతమంది అవకాశంగా భావిస్తే.. మరికొంతమంది మాత్రం ప్రాణానికి ప్రాణంగా స్వీకరిస్తారని అంటారు.;

Update: 2026-02-09 06:44 GMT

ఓ వ్యక్తి ఒక మహిళతో సుమారు 3 ఏళ్లుగా ప్రేమలో ఉన్నాడు.. ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరిగారు.. ఈ క్రమంలో తన ప్రియురాలి కుటుంబానికి ఉన్న ఆర్థిక సమస్యల్లోనూ అతడు అండగా ఉన్నాడని అంటున్నారు.. మరికొన్ని రోజుల్లో జరగబోయే ప్రేమికుల పండుగ వాలంటైన్స్ డే కోసం ఆమెకు ఓ గిఫ్ట్ కొని సిద్ధం చేసుకున్నాడు.. అంతవరకూ బాగానే ఉంది! కట్ చేస్తే... ఆమె తన కొత్త చీర, నిశ్చితార్ధం జరిగిన విషయం, పెళ్లి పత్రిక చూపించింది. ఆ ప్రియుడి గుండె ఆగిపోయింది!

అవును... అవతలి వ్యక్తి ప్రేమను కొంతమంది అవకాశంగా భావిస్తే.. మరికొంతమంది మాత్రం ప్రాణానికి ప్రాణంగా స్వీకరిస్తారని అంటారు. ఈ సమాజంలో ప్రాణానికి ప్రాణంగా ప్రేమించేవారికీ కొదవలేదు.. ప్రేమను మోసానికి ముగుసుగా ధరించేవారికీ లోటు లేదని చెబుతారు. ఆ సంగతి అలా ఉంటే... తాజాగా త్వరలో తనను వివాహం చేసుకుంటుందని నమ్మిన ప్రియురాలు.. తన వివాహ ఆహ్వాన పత్రికను చూపించే సరికి ఓ ప్రియుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన బెంగళూరులో వెలుగు చూసింది.

వివరాళ్లోకి వెళ్తే... ఉత్తర బెంగళూరులోని మహాలక్ష్మీ లేఅవుట్ లో నివాసం ఉంటున్న కిరణ్ అనే 26 ఏళ్ల జిమ్ ట్రైనర్, బాడీ బిల్డర్.. తన ఇంట్లో ఆత్మహత్య చేసుకుని మరణించాడు. అందుకు కారణం.. తాను ప్రేమించిన మహిళ మరొకరిని వివాహం చేసుకోవడానికి నిశ్చితార్ధం చేసుకున్నట్లు తెలియడమే అని అంటున్నారు. ఈ సందర్భంగా తన మరణానికి తన ప్రియురాలు, ఆమె తల్లి కారణమని డెత్ నోట్ లో వెళ్లడించినట్లు చెబుతున్నారు.

ఈ సందర్భంగా స్పందించిన పోలీసులు.. కిరణ్ సుమారు మూడు సంవత్సరాలుగా ఆ మహిళతో సంబంధం కలిగి ఉన్నాడని చెబుతున్నారు. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం... ఆ మహిళ తన నిశ్చితార్ధం గురించి కిరణ్ కి తెలియజేసి.. ఈ సందర్భంగా తన వివాహ ఆహ్వాన పత్రిక, పెళ్లి చీర చూపించింది. ఇది జరిగిన సుమారు రెండు వారాలవుతుంది. ఈ క్రమంలో తీవ్ర మనస్తాపానికి గురైన కిరణ్.. శనివారం సాయంత్రం ఇంటికి వచ్చి తన తల్లిని వైట్ పేపర్, పెన్ అడిగి, గదిలోకి వెళ్లాడు!

ఈ సందర్భంగా తన మరణానికి కారణం తన ప్రియురాలు, ఆమె తల్లి అని ఆ వైట్ పేపర్ పై రాశాడు! ఇదే సమయంలో ఆ డెత్ నోట్ పై తన ఫోన్ పాస్ వర్డ్ ను నోట్ చేశాడు. ఈ సందర్భంగా స్పందించిన కిరణ్ కుటుంబ సభ్యులు... కిరణ్ తాను ప్రేమించిన అమ్మాయి రుణం తీర్చడానికి చాలా ఖర్చు చేశాడని.. ఆమెను పెళ్లి చేసుకుంటానని చెప్పి తమకు పరిచయం చేశాడని.. అయితే ఆమె మోసం చేసిందని ఆరోపించారు! ఇదే క్రమంలో అతడు పలు బాడీ బిల్డింగ్ పోటీల్లోనూ పాల్గొన్నాడని తెలిపారు!

ఈ సమయంలో మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. పోస్టుమార్టం కోసం బాడీని మార్చురీకి తరలించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా మహాలక్ష్మి లేఅవుట్ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News