ప్రార్థనల కోసం వెళ్తే పాడు పని చేసి మొహం చాటేసిన ఫాస్టర్ .. ఆ యువతికి అండగా కరాటే కల్యాణి !
ప్రార్థనల కోసం చర్చి కి వెళ్తే , పెళ్లి చేసుకుంటానని చెప్పి ఓ పాస్టర్ తనను నమ్మించి మోసం చేశాడని ఓ యువతి ఆరోపణలు చేస్తుంది. ఈ మేరకు సినీ నటి కరాటే కల్యాణి సహాయంతో బాధితురాలు మంగళవారం తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం రెండో పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. పొలీసులు, బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. తూర్పుగోదావరి జిల్లా కడియం మండలానికి చెందిన ఓ యువతి ఆల్కట్ తోట సమీపంలోని ఓ ప్రార్థనా మందిరానికి వెళ్లేదట. అక్కడి పాస్టర్ తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి శారీరకంగా లోబర్చుకున్నాడని బాధిత యువతి అయన పై ఆరోపణలు చేస్తుంది.
శారీరకంగా లోబరచుకున్న , కొంతకాలంగా తరువాత ముఖం చాటేశాడని చెప్తుంది. అలాగే ఫోన్ లో కూడా అందుబాటులో లేకపోవడంతో ఆమె చర్చికి వెళ్లి ,పాస్టర్ ను నిలదీసి , పెళ్లి చేసుకోవాలంటూ ఒత్తిడి చేస్తే , ఆ యువతి నగ్న వీడియోలతో బ్లాక్ మెయిల్ కు దిగాడట. అలాగే చంపుతానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు అని ఆ యువతి చెప్పుకొచ్చింది. తనకు తండ్రి లేడని, అందుకే భయపడి హైదరాబాద్‌కు వెళ్లిపోయినట్లు యువతి తెలిపింది.
ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ ఎదుట కరాటే కళ్యాణి మీడియాతో మాట్లాడుతూ.. హైదరాబాద్ వచ్చిన బాధితురాలు ఇటీవలే తనను కలిసిందని చెప్పారు. దీంతో యువతికి ధైర్యం చెప్పి ,తొలుత షీ-టీమ్స్‌ను సంప్రదించామని , ఆ తర్వాత షీ టీమ్స్ ఇచ్చిన సూచనల ప్రకారం.. రాజమండ్రి రెండో టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశామని చెప్పారు. బాధితురాలికి న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.