మీరు చేసే వీడియో కాల్స్ , మెసేజ్, కాల్స్ తోనే పర్యావరణానికి ముప్పు !
వీడియో కాల్స్ , మెసేజ్, కాల్స్ తో పర్యావరణానికి నష్టం ఎలాగా అని ఆలోచిస్తున్నారా, వీటితోనే కాదు.. మీరు డౌన్ లోడ్ లేదా అప్ లోడ్ చేసే వీడియోలు, ఇంటర్నెట్ వినియోగం వీటన్నిటి వల్ల పర్యావరణానికి తీవ్ర హాని జరుగుతోందని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఎందుకంటే వీటిని ప్రాసెస్ చేయడానికి పెద్దఎత్తున డేటా కేంద్రాలు, కమ్యూనికేషన్ వ్యవస్థలు నిరంతరాయం పనిచేస్తుంటాయి.
అప్పట్లో అయితే హాయిగా పక్కనే కూర్చొని ముచ్చట్లు పెట్టేవారు. ఆ తర్వాత ఫోన్స్ , ఆ తర్వాత వీడియో కాల్స్ లోనే పక్కనే ఉన్నట్టుగా ఫీల్ అవుతూ ముచ్చట్లు పెడుతున్నారు. ఇక లాక్ డౌన్ తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా పెరిగిందిపోయింది. ఈ క్రమంలోనే వీడియో కాల్స్, వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొనే వారి సంఖ్య భారీగా పెరిగిపోయింది.
టెక్నాలజీ మిగిల్చిన దుష్ప్రభావాలను తగ్గించే ప్రయత్నాలపై ప్రజలు అవగాహన పెంచుకోవాలని ,గ్యాడెట్లు, ఇతర డివైజ్‌లను వాడేటప్పుడు మనం తీసుకునే చిన్నపాటి జాగ్రత్తలే ప్రకృతికి ఎంతోకొంత మేలు చేస్తాయని, వర్చువల్ మీటింగ్స్ లో పాల్గొనేవారు కెమెరాను ఆపేయడం వల్ల కార్బన్ ఉద్గారాలను చాలావరకు తగ్గించవచ్చని తాజా అధయనం వెల్లడించింది.
వెబ్ కాల్స్, లేదా మీటింగ్స్ లో పాల్గొనేవారు కెమెరాను స్విచ్ ఆఫ్ చేయడం వల్ల.. ఒక వ్యక్తి ద్వారా విడుదలయ్యే కార్బన్ ఉద్గారాలను 96 శాతం వరకు తగ్గించవచ్చని పరిశోధకులు తేల్చారు. అమెరికాలోని పుర్డ్యూ యూనివర్సిటీకి చెందిన నిపుణులు ఈ పరిశోధన చేశారు. ఈ అధ్యయనాన్ని 'రిసోర్సెస్, కన్జర్వేషన్ అండ్ రీసైక్లింగ్' జర్నల్ లో ప్రచురించారు.
నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వంటి స్ట్రీమింగ్ యాప్ లను ఉపయోగిస్తున్నప్పుడు హై డెఫినెషన్ లో కాకుండా స్టాండర్డ్ డెఫినెషన్ లో కంటెంట్ ను చూడటం వల్ల కూడా కార్బన్ ఉద్గారాలను 86 శాతం వరకు తగ్గించవచ్చని చెప్పారు. ఇంటర్నెట్ వినియోగం పర్యావరణాన్ని ఎలా ప్రభావితం చేస్తుందనే అంశంపై ఈ పరిశోధనలు చేశారు. ఏదైనా ఒక యాప్ లో వీడియోలను ఎక్కువగా చూసినప్పుడు కార్బన్ వాయువులు ఎక్కువగా విడుదలవుతున్నాయని అధ్యయన బృందం గుర్తించింది.