2021 గురించి గుడ్ న్యూస్ చెప్పిన ఐక్యరాజ్యసమితి
కరోనా లాక్ డౌన్ తో కుదేలైన ఆర్థిక వృద్ధి మళ్లీ లేపడం కష్టమని అందరూ భావించారు. ఇప్పటికే భారత్ సహా ప్రపంచదేశాల ఆర్థిక వృద్ధి రేటు మైనస్ లలోకి జారిపోయింది. అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలిపోయాయి.
అయితే కొత్త సంవత్సరం 2021 జనాలకు భరోసానిస్తుందని ఐక్యరాజ్యసమితి తెలిపింది. 2021లో భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి కోలుకొని 7.3 శాతానికి పెరుగుతుందని ఐక్యరాజ్యసమితి ‘ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పరిస్థితులు-అవకాశాలు’ పేరుతో రిలీజ్ చేసిన నివేదికలో వెల్లడించింది.
గత ఏడాది ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధి 4.3శాతం తగ్గినట్లుగా చెప్పింది. ఇది 2009 సంక్షోభంతో పోల్చితే రెండున్నర రెట్లు ఎక్కువ.ఈ ఏడాది వృద్ధి 4.7శాతంతో కోలుకుంటే నష్టాలు పూడ్చవచ్చని యూఎన్ అంచనావేసింది. భారత్ చరిత్రలోనే అతిపెద్ద ఆర్థిక క్షీణత సంవత్సరంగా 2020 నిలిచిందని పేర్కొంది.