మిరాకిల్.. ఆగిన గుండె మళ్లీ కొట్టుకుంటోంది..ఇప్పటికిలా 8 సార్లు
డాక్టర్లకు అంతుచిక్కని ఓ వింత రోగంతో బాధపడుతోంది ఓ యువతి. ఇప్పటి వరకు ఎనిమిది సార్లు ఆమె గుండె ఆగిపోయింది. చనిపోయిందని డాక్టర్లు నిర్ధారించాక.. ఆమె కుటుంబసభ్యులు కూడా రోదిస్తుండగా ఆమె మళ్లీ లేచికూర్చొనేది. ఆగిపోయిన ఆమె గుండె ఎనిమిది నిమిషాల తర్వాత మళ్లీ కొట్టుకోవడం ప్రారంభించేది. ప్రపంచంలోనే ఇంత వింత సంఘటన మరెక్కడా జరిగి ఉండదేమో. ఒక మనిషి ఎనిమిది సార్లు గుండె ఆగి చనిపోయినట్లు నిర్ధారించాక మళ్లీ బ్రతకడం నిజంగా మిరాకిల్ అని ఇది విన్న వారు అంటున్నారు.
అమీ అనే యువతి కి 2017లో తొలిసారి గుండెపోటు వచ్చింది. శరీరం మొత్తం చచ్చుబడిపోయింది. డాక్టర్లు కూడా ఆమె చనిపోయిందని నిర్ధారించారు. అయితే ఆశ్చర్యం గా ఎనిమిది నిమిషాల తర్వాత ఆమె గుండె మళ్లీ స్పందించింది. వైద్య శాస్త్రంలోనే ఇదో మిరాకిల్ అని వైద్యులు చెబుతున్నారు. అమీ పోస్టురల్ టాచీకార్డియా సిండ్రోమ్ ( పీవోటీఎస్) వ్యాధితో ఆమె బాధపడుతున్నదని వైద్యులు చెప్పారు. ఈ రోగం చాలా అరుదుగా వస్తుందని చెబుతున్నారు. ఈ రోగికి ఒక్కసారిగా హార్ట్‌రేట్ పడిపోతుంది. అందువల్ల, ఆమె నిల్చోబోతే ఆమెకు హార్ట్ బీటింగ్ పెరిగి కుప్పకూలిపోతుంది. అది సరే, దానికి, హార్ట్ ఎటాక్ కు సంబంధమేంటి? డాక్టర్లకు అర్ధంకావడంలేదు. అయితే ఇటువంటి పరిస్థితి ని కూడా అమీ ఎంతో పాజిటివ్ గా తీసుకుంటోంది. తనకు ఏం కాలేదు.. అని తన వాళ్ల కు ధైర్యం చెబుతోంది. అంతేకాక ఆమె ఓ బ్లాగ్‌లో ఎప్పటికప్పుడు తన అనుభవాలను రాస్తూ వివిధ రోగాలతో బాధపడే వారికి ధైర్యం చెబుతోంది.