అంబానీ.. అదానీలను బహిష్కరించాలంటూ రైతుల సంచలన నిర్ణయం
సంచలనంగా మారిన రైతుల ఉద్యమం ఇప్పుడు కీలక మలుపు తిరిగింది. వణికించే చలిలో దగ్గర దగ్గర రెండు వారాల నుంచి చేస్తున్న నిరసన ఉద్యమంలో.. ఊహించని నిర్ణయాన్ని తాజాగా ప్రకటించాయి రైతు సంఘాలు. మోడీ సర్కారు తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాల్ని వెనక్కి తీసుకోవాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తుంటే.. వాటికి సవరణలు తీసుకొస్తామని ప్రభుత్వం చెప్పటాన్ని వారు తీవ్రంగా మండిపడుతున్నారు. తాజాగా అమిత్ షాతో భేటీ అయిన వ్యవసాయ సంఘాల ప్రతినిధులు.. ప్రభుత్వ ప్రతిపాదనల్ని తిరస్కరించారు.
తమను చర్చలకు పిలవటం వెనుక బడా కార్పొరేట్ సంస్థల ఒత్తిడి ఉందని భావిస్తున్న రైతు సంఘాలు వినూత్నంగా వ్యవహరించాయి. అంబానీ.. అదానీల ఉత్పత్తుల్ని బాయ్ కాట్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఒక రకంగా రైతులు కార్పొరేట్లపై యుద్ధం ప్రకటించారని చెప్పాలి. అంబానీకి చెందిన రిలయన్స్.. రిలయన్స్ మాల్స్ తో పాటు.. జియో ఉత్పత్తుల్ని వాడరాదని డిసైడ్ అయ్యారు. ఇందులో భాగంగా జియో సిమల్ ను పక్కన పెట్టాలని వారు పిలుపునిస్తున్నారు. రైతుల ఆందోళనలో ఇదో కొత్త మలుపుగా అభివర్ణిస్తున్నారు.
జియో నెట్ వర్కును వదిలేయాలని రైతులు భావించటం షాకింగ్ పరిణామంగా అభిప్రాయపడుతున్నారు. ఇక.. అదానీలకు పంట ఉత్పత్తుల నిర్వహణలో సంబంధం ఉన్న నేపథ్యంలో ఆ గ్రూపునుకూడా బాయ్ కాట్ చేస్తామని వారు చెబుతున్నారు. అయితే.. తమపై రైతు సంఘాల వారు తప్పుడు అభియోగాల్ని మోపుతున్నట్లుగా వారు పేర్కొన్నారు. తాజాగా వారు విడుదల చేసిన ప్రకటనలో.. ‘‘మేం రైతుల నుంచి పంట ఉత్పత్తుల్ని కొనుగోలు చేయటం లేదు. వాటి ధర విషయంలో మా పాత్ర ఏమీ లేదు. భారత ఆహార సంస్థ బాధ్యత మాత్రమే. మేం కేవలం ఎఫ్ సీఐ.. గోదాములు.. కోల్డ్ స్టోరేజీల నిర్వహణ వరకే మా బాధ్యత’’ అని పేర్కొన్నారు.
దేశ చరిత్రలో ఇప్పటివరకు ఎప్పుడు లేని రీతిలో.. కేవలం సినిమాల్లో మాత్రమే కనిపించే సీన్ ఇప్పుడు రైతు సంఘాలు తెర మీదకు తెచ్చాయని చెప్పాలి. రైతులు వర్సెస్ కార్పొరేట్ల కాంబినేషన్ ఇప్పటివరకు లేదంటున్నారు. ఊహించని విధంగా రెండు బడా కార్పొరేట్ సంస్థల్ని తమ నిరసలనకు కేంద్రంగా చేయటం రైతు ఉద్యమంలో కీలకాంశమని అభివర్ణిస్తున్నారు.