• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  మే 6 నుంచే విశాఖ రాజధాని...

మే 6 నుంచే విశాఖ రాజధాని పాలన?

By - Tupaki Desk
Update: 2021-03-25 17:30 GMT
జగన్ సర్కార్ ఏర్పడ్డప్పటి నుంచి కోర్టుల్లో నిర్ణయాలపై ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఏపీ మూడు రాజధానులు, అమరావతి వివాదం ఇంకా ఓ కొలిక్కి రాలేదు. జడ్జీల తీర్పులపై సుప్రీంకోర్టు సీజేకు లేఖ రాసిన జగన్ సంచలనం సృష్టించారు.

అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ విశాఖకు రాజధానిని తరలించడంలో జాప్యం చేయరాదని జగన్ డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. పరిపాలన రాజధానిగా విశాఖను ఖాయం చేసిన జగన్ ఈ మేరకు అన్ని విభాగాల అధిపతులు (హెచ్.ఓ.డీ)లకు ఆదేశాలు జారీ చేశారని.. వారిని విశాఖకు పంపాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే జగన్ 130 మంది హెచ్.ఓ.డీలకు మౌఖిక ఆదేశాలు జారీ చేశారని సమాచారం.

ఇప్పుడు అధికార యంత్రాంగం అంతా తమకు అనువైన ప్రాంతాలను ఎంచుకునేందుకు విశాఖలో తిష్టవేసినట్లు తెలుస్తోంది. అమరావతి నుంచి హెచ్.ఓ.డీలను విశాఖకు తరలించేందుకు ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది.

మే 6వ తేది నుంచి అన్ని శాఖలు విశాఖ కేంద్రంగా పనిచేసే ఏర్పాట్లు సాగుతున్నాయి. సరిగ్గా మే 30 నాటికి జగన్ సీఎంగా ప్రమాణం చేసి రెండేళ్లు అవుతుంది. ఈ నేపథ్యంలో మే 6 నుంచి విశాఖలో హెచ్.ఓ.డీలను ప్రారంభిస్తే 24 రోజుల్లోపు పరిపాలనను గాడిలోకి తీసుకొచ్చి ముచ్చటగా మూడో ఏడాది నుంచి మూడు రాజధానుల  నుంచి విధులు నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

మూడు రాజధానులు అమరావతిపై కోర్టుల్లో చిక్కులు ఉన్నా మూడు రాజధానులపై జగన్ దూకుడు చర్చనీయాంశమవుతోంది.
Tags:    
  • Ap Cm Jagan Mohan Reddy 
  • Ycp Party 
  • vizag 
  • andhra pradesh 
  • capitals 

Similar News

ఆధార్ ప్లేసులో ఓటర్ ఐడీ.. కేంద్రం మరో దుమారం?

2026-11-05 16:15 GMT

పాక్ పై కొట్టింది కానే కాదట.. విరాట్ కోహ్లీ బెస్ట్ వన్డే ఇన్నింగ్స్ లు ఏవో తెలుసా?

2026-11-05 16:14 GMT

ఏపీ ఎన్నిక‌ల్లో ఒక విషాదం.. మ‌రిన్ని చిత్ర విచిత్రాలు!

2026-11-05 16:12 GMT

'దేశ ద్రోహం': మోడీ రేపిన 'రాహుల్ మంట‌లు'!

2026-11-05 16:11 GMT

చెవిరెడ్డ‌న్నా.. గొడ‌వ‌లు వ‌ద్దు.. టీడీపీ నేత బిగ్ ఆఫ‌ర్‌!

2026-11-05 16:09 GMT

అనంత‌లో తేడా ఎక్క‌డ కొట్టింది.. బాబు ఆరా.. !

2026-11-05 13:30 GMT

ఎన్నికలా..? ఏకపక్ష ఎంపికలా..? జగన్ ఆరోపణలతో మళ్లీ రాజకీయ దుమారం

2026-11-05 12:50 GMT

ఫుట్ బాల్ లో మరో లెజెండ్ రిటైర్ మెంట్

2026-11-05 12:34 GMT

చీప్.. వెరీ చీప్..పాకిస్తాన్ లో బంగారం ఎంత తక్కువనో తెలుసా?

2026-11-05 12:19 GMT

వ్యాపారంలోనూ కోహ్లీ కింగ్.. రూ. 1,600 కోట్ల సామ్రాజ్యం వెనుక అసలు కథ ఇది

2026-11-05 10:10 GMT

కాంగ్రెస్‌లో క్రమశిక్షణకు పరీక్ష

2026-11-05 10:01 GMT

డేటింగ్ నుంచి వివాహం వరకు.. నేటి యువత మైండ్‌సెట్‌పై ప్రభుత్వం ఫోకస్!

2026-11-05 08:08 GMT

Copyright @2026

Powered by Blink CMS