‘చిల్​ ట్రంప్​’ ఎట్టకేలకు పగ సాధించిన పర్యావరణ కార్యకర్త గ్రెటా!

Update: 2020-11-06 12:50 GMT
అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు డొనాల్డ్​ ట్రంప్​కు తీవ్ర నిరాశను మిగిల్చాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ విజయం సాధిద్దామనుకున్న ట్రంప్​కు ప్రజలు గట్టి షాక్​ ఇచ్చారు. మొదట్లో కొన్ని రాష్ట్రాల్లో ఆధిక్యం ప్రదర్శించినట్టు కనిపించినా రానురాను ప్రత్యర్థి బైడెన్​ స్పష్టమైన ఆధిక్యం కనబరుస్తున్నారు. ఇంకో ఆరు ఎలక్ట్రోరల్​ సీట్లు సాధిస్తే బైడెన్​ విజయం సాధించినట్టే. ఈ నేపథ్యంలో డొనాల్డ్​ ట్రంప్​ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ట్వీట్లలో ప్రత్యర్థులపై అక్కసు వెళ్లగక్కుతున్నారు. ఓ దశలో అతడి ట్వీట్లను ట్విట్టర్​ వరసగా తొలగించివేసింది. మరోవైపు కోర్టుకు వెళ్లాలన్న ఆశలు కూడా అడుగంటాయి.  దీంతో ట్రంప్​పై అతడి పాత శత్రువులు విరుచుకుపడుతున్నారు. గతంలో ఓసారి స్వీడిష్‌కు చెందిన ప‌ర్యావ‌ర‌ణ కార్య‌క‌ర్త గ్రెటా థన్‌బె‌ర్గ్ ను ఎగతాళి చేస్తూ ట్రంప్​ ట్వీట్ పెట్టాడు.  2019లో  టైమ్ మ్యాగజైన్  గ్రెటా థన్‌బె‌ర్గ్ ను  ‘ఇయర్‌ ఆఫ్‌ ది పర్సన్’ పేరుతో సత్కరించింది. 

 ఈ సందర్బంగా ట్రంప్​ ఆమెను ఎగతాళి చేస్తూ ట్వీట్​ పెట్టాడు. ‘చిల్‌ గ్రెటా  నీకు అవార్డు రావడం చాలా హాస్యాస్పదం. ఈ వయసులో నువ్వు స్నేహితుడితో ఫ్యాషన్ సినిమాకు వెళ్లాలి. కానీ అవార్డులు ఏమిటి’ అంటూ ట్వీట్​ పెట్టాడు. దీంతో ఆమె ఎంతో నొచ్చుకున్నది. సమయం కోసం వెయిట్​ చేసింది. ప్రస్తుతం అమెరికాలో డెమొక్రాట్ జో బైడెన్‌ అమెరికా అధ్యక్ష పీఠాన్ని చేరువులో ఉన్నారు. ట్రంప్​ ఓటమిని అంగీకరించలేక "స్టాప్ ది కౌంట్!" అంటూ రగిలిపోతున్నాడు. టైం కోసం వెయిట్​చేసిన గ్రెటా పగ సాధించుకున్నది. ‘చిల్​ ట్రంప్​.. ఇటువంటి సమయంలోనే మీరు యాంగర్​ మేనేజ్​మెంట్ పై దృష్టి పెట్టాలి.  మీ స్నేహితుడితో కలిసి ఏదైనా మంచి పాత ఫ్యాషన్‌ సినిమాకు వెళ్లండి! చిల్, డొనాల్డ్, చిల్!" అంటూ థన్‌బర్గ్ గురువారం ట్వీట్ చేశారు. ఈ ట్వీట్​ సోషల్​మీడియాలో తెగ వైరల్​ అవుతున్నది. గ్రెటాకు రీట్వీట్లు లైకులు మారుమోగిపోతున్నాయి.
Tags:    

Similar News