షాకింగ్ గా మారిన మోడీ సర్కారు తీసుకొస్తున్న తాజా బిల్లు
కొత్త చట్టాల్ని తీసుకొచ్చేందుకు వీలుగా మోడీ సర్కారు వడివడిగా కొత్త బిల్లుల్ని సభ ముందుకు తీసుకొస్తోంది. తాజాగా తీసుకొస్తున్న బిల్లు కానీ చట్టమైతే.. దేశంలోని ఉద్యోగుల భద్రత అన్నది గాల్లో దీపంగా మారుతుందన్న మాట బలంగా వినిపిస్తోంది. కంపెనీలకు భారీ ఊరటగా మారే ఈ బిల్లు.. ఉద్యోగులకు మాత్రం దిమ్మ తిరిగిపోయేలా షాకిస్తుందని చెప్పక తప్పదు.
తాజాగా కేంద్ర కార్మిక శాఖా మంత్రి సంతోష్ గాంగ్వార్ కొత్త బిల్లును సభలోకి తీసుకొచ్చారు. ఇండస్ట్రియల్ రిలేషన్ కోడ్ బిల్ 2020 పేరుతో తీసుకొస్తున్న ఈ బిల్లులో అందరూ అభ్యంతరం తెలిపే అంశం ఒకటి బయటకు వచ్చింది. బిల్లులోని ప్రతిపాదన ప్రకారం ఏదైనా కంపెనీలో 300 మంది కంటే తక్కువ మంది ఉద్యోగులు ఉంటే.. సదరు యాజమాన్యం ఎవరికి ఏమీ చెప్పకుండానే ఉద్యోగుల ఉద్యోగాల్ని తీసివేసే వీలుంది.
గతంలో ఈ పరిమితి వందమంది ఉద్యోగులున్న సంస్థలకే వర్తించేది. తాజాగా మాత్రం వంద కాస్తా మూడు వందల వరకు పెరగటం కంపెనీలకు మేలు చేస్తుందని చెబుతున్నారు. వాస్తవానికి ఈ బిల్లును2019లో సభలోకి తీసుకొచ్చారు. అనంతరం దాన్ని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి పంపారు. ఆ బిల్లును ఉపసంహరించటంతో కొత్త బిల్లురూపంలో మరోసారి సభ ముందుకు తెచ్చారు. మరీ బిల్లు ఈసారి చట్టంగా మారుతుందా? అన్నది ప్రశ్న. అదే జరిగితే మాత్రం ఉద్యోగులకు భారీ షాక్ తప్పదంటున్నారు.