పాపం..పవన్ పరిస్దితి ఇలాగైపోయిందే ?

Update: 2021-09-27 05:10 GMT
జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ పెద్ద షాకే ఇచ్చింది. తానొక్కడే మొత్తం సినీపరిశ్రమను భుజాన మోస్తున్నంతగా బిల్డప్ ఇచ్చిన పవన్ కు తాజా పరిణామాలు ఏమాత్రం ఊహించనిదనే చెప్పాలి. ఓ సినిమా ఫంక్షన్ కు హాజరైన పవన్ ఏపి ప్రభుత్వంతో పాటు జగన్మోహన్ రెడ్డి, మంత్రి పేర్నినానిని వ్యక్తిగతంగా టార్టెట్ చేసిన విషయం సంచలనంగా మారింది. అనవసరంగా, అసందర్భంగా జగన్, మంత్రిని పవన్ వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు. దాంతో వ్యవహారం చాలా దూరమే వెళ్ళేట్లుందని అందరు అనుమానించారు.

ఒకవైపేమో సినీరంగం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించమని పరిశ్రమలోని కొందరు పెద్దలు గతంలోనే జగన్ను కలిశారు. తాజాగా మంత్రి పేర్నినానితో కూడా భేటీ అయ్యారు. జగన్ కూడా సమస్యల పరిష్కారం విషయంలో సానుకూలంగానే స్పందిస్తున్నారు. ఇంతలోనే ఏమయ్యిందో ఏమో ఓ ఫంక్షన్లో పవన్ ఒక్కసారిగా రెచ్చిపోయారు. నోటికొచ్చినట్లు మాట్లాడి జగన్ పై బురదచల్లేశారు.

పవన్ ఆరోపణలు, వ్యాఖ్యలు విన్నవారంతా ప్రభుత్వంతో అనవసరంగా పవన్ గొడవ పడుతున్నారనే ప్రచారం సినీఫీల్డులో పెరిగిపోయింది. పవన్ను సమర్ధించాలా ? లేకపోతే ప్రభుత్వాన్ని సమర్ధించాలా అనే విషయంలో శనివారం రాత్రినుండే ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ లో పెద్దఎత్తున చర్చలు జరిగినట్లు సమాచారం. పవన్ వ్యాఖ్యలను సమర్ధిస్తే జరగబోయేదేమిటో సినీ పెద్దలకు బాగా అర్ధమైంది.
Read more!

జగన్ పై పవన్ చేసిన ఆరోపణల్లో ఒక్కటికి కూడా వాస్తవం లేదని సినీ పెద్దలందరికీ తెలుసు. సినీ ఫంక్షన్ కు హాజరైన పవన్ ఫంక్షన్ విషయం మాత్రమే టచ్ చేయకుండా అనవసరంగా జగన్ పై తనకున్న కసినంతా తీర్చుకున్నారనే అభిప్రాయం అందరిలోను పెరిగిపోయింది. అంటే జగన్ పై వ్యక్తిగతంగా పవన్ కున్న మంటను సినిమా ఫంక్షన్లో తీర్చుకున్నారని సినీపెద్దలు ఓ అభిప్రాయానికి వచ్చారు. అందుకనే ఆదివారం మధ్యాహ్నం అత్యవసర సమావేశం జరిపారు.

శనివారం పవన్ చేసిన ఆరోపణలను, వ్యాఖ్యలపై సినీపెద్దలు చర్చించారు. అలాగే ఆదివారం ఉదయం నుండి పవన్ కు వ్యతిరేకంగా మంత్రులు ప్రధానంగా పేర్నినాని మీడియా సమావేశంలో మాట్లాడిన మాటలపైన కూడా చర్చించారట. అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత పవన్ చేసిన వ్యాఖ్యలకు ఫిల్మ్ చాంబర్ కు సంబంధంలేదని తేల్చారు. అందుకనే ఆదివారం రాత్రి పొద్దుపోయిన తర్వాత ఫిల్మ్ చాంబ్ తర్వాత ఓ ప్రెస్ నోట్ విడుదల చేశారు.

వ్యక్తిగతంగా పవన్ చేసిన వ్యాఖ్యలకు ఫిల్మ్ చాంబర్ కు ఎలాంటి సంబంధం లేదని తేల్చేసింది. చిత్రపరిశ్రమకు రెండు ప్రభుత్వాల మద్దతు చాలా అవసరమని స్పష్టంచేసింది. ప్రభుత్వాల మనుగడ లేకుండా సినీపరిశ్రమ మనుగడ సాగించటం కష్టమని ప్రకటించింది. ఫంక్షన్లో పవన్ చేసిన ఆరోపణలు, వ్యక్తంచేసిన అభిప్రాయాలు పూర్తిగా ఆయన సొంతమేనని తేల్చేసింది. తమ సమస్యల పరిష్కారం విషయంలో ఇప్పటికే జగన్ సానుకూలంగా స్పందిస్తున్నట్లు చాంబర్ చెప్పింది.

సినీపరిశ్రమకు ఇద్దరు సీఎంల మద్దతు కంటిన్యు అవుతాయని ఆశాభావాన్ని వ్యక్తంచేసింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే పవన్ కు ఆయన సోదరుడు చిరంజీవి కూడా మద్దతు ప్రకటించలేదు. ప్రభాస్, జూనియర్ ఎన్టీయీర్ అయినా మద్దతు వస్తారని అనుకుంటే చివరకు వారుకూడా రాలేదు. మొత్తంమీద పవన్ కు సినీపరిశ్రమలోని ఏ ఒక్కరినుండి మద్దతు దొరకలేదని అర్ధమైపోయింది. తనను తాను చాలా ఎక్కువగా ఊహించుకున్న ఫలితమే ఇది.
Tags:    

Similar News