స్టార్ టెన్నీస్ క్రీడాకారుడికి పాజిటివ్‌: ఫైన‌ల్ మ్యాచ్ ర‌ద్దు

Update: 2020-06-22 16:30 GMT
క్రీడాకారుల‌కు కూడా మ‌హ‌మ్మారి వైర‌స్ పాకుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు భార‌త‌దేశానికి సంబంధించిన క్రీడాకారులెవ‌రికీ వైర‌స్ వ్యాపించ‌లేదు. విదేశీ ఆట‌గాళ్లు ఆ వైర‌స్ బారిన ప‌డుతున్నారు. ఈ విధంగా వైర‌స్ వ్యాప్తి చెందుతుండ‌డంతో క్రీడా కార్య‌క్ర‌మాల‌న్నీ ర‌ద్దు చేసిన విష‌యం తెలిసిందే. అయినా కూడా క్రీడాకారులకు వైర‌స్ వ్యాపిస్తోంది. తాజాగా ప్ర‌ముఖ టెన్నీస్ స్టార్‌కు పాజిటివ్ వ‌చ్చింది.

బ‌ల్గేరియా దేశానికి చెందిన టెన్నీస్ స్టార్ ప్లేయ‌ర్ గ్రిగోర్ డిమిట్రోవ్ కు వైర‌స్ లక్ష‌ణాలు క‌నిపించాయి. ప్రపంచ నంబర్ 19 టెన్నిస్ స్టార్‌గా డిమిట్రోవ్ కొన‌సాగుతున్నాడు. వైర‌స్ సోకిన విష‌యాన్ని అత‌డే స్వ‌యంగా చెప్పాడు. “మొనాకోలో ఉన్నప్పుడు చేసిన టెస్టుల్లో నాకు వైర‌స్‌ సోకిన‌ట్లు తెలిసింది. కొద్దిరోజులుగా నాతో సన్నిహితంగా ఉన్నవారందరూ వైద్య ప‌రీక్ష‌లు చేయించుకోండి. తగిన జాగ్రత్తలు తీసుకోండి. నా వల్ల మీకు కలిగిన నష్టానికి క్ష‌మించ‌మ‌ని కోరుతున్నా. ప్రస్తుతం నా ఆరోగ్య ప‌రిస్థితి బాగానే ఉంది, కోలుకుంటున్నా” అని అత‌డు త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో తెలిపారు.

అన్ లాక్ స‌డ‌లింపుల్లో భాగంగా జూన్‌ 13 నుంచి జులై 5 వరకు సెర్బియా, మాంటెనెగ్రో, క్రొయేషియాలోని మట్టి కోర్టుల్లో ఆడ్రియా టెన్నిస్ టూర్ మ్యాచ్లు జరుగుతున్నాయి. వాస్త‌వంగా దిమిట్రోవ్ నోవాక్ జకోవిచ్ ఆధ్వర్యంలో ఎగ్జిబిషన్ టోర్నీలో పాల్గొనాల్సి ఉంది. అయితే అత‌డికి వైర‌స్ సోకింద‌నే వార్త తెలియ‌గానే ఆదివారం జరగాల్సిన ఫైనల్ను రద్దు చేశారు.
Tags:    

Similar News