న్యూయార్క్ లో పబ్లిక్ పార్కుల్లో కరోనా శవాల ఖననం?

Update: 2020-04-09 00:30 GMT
అమెరికాను కరోనా పట్టిపీడిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక కరోనా కేసుల కేంద్రంగా అమెరికా మారిపోయింది.  ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో 27శాతం ఒక్క అమెరికాలోనే నమోదు అవుతుండడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఇక అమెరికా మొత్తం మీద ఒక్క న్యూయార్క్ లోనే 40శాతంపైగా కేసులు నమోదవుతున్నాయి. ఇక్కడ మరణాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి.

న్యూయార్క్ లో రోజుకు 1500 మందికి పైగా మరణాలు సంభవిస్తుండడంతో సాధారణ శ్మశనావాటికలు - అంత్యక్రియలు నిర్వహించే వ్యవస్థలు నిండిపోయాయి. దీంతో శవాలను ఖననం చేసే వీలులేక ఏం చేయాలో పాలుపోక మార్చురీలలో శవాలను భద్ర పరుస్తున్న దుస్థితి నెలకొంది.

అయితే తాజాగా శ్మశన వాటికలు నిండి పోవడంతో పబ్లిక్ పార్కులలో తాత్కాలికంగా శవాలను ఖననం చేస్తున్నట్టు పుకార్లు షికారు చేశాయి. దీనిపై న్యూయార్క్ నగర కౌన్సిల్ ఆరోగ్య కమిటీ చైర్మన్ మార్క్ డి లెవిన్ స్పష్టతనిచ్చాడు.

మొదట్లో కరోనా మృతదేహాలను ఏం చేయాలో పాలుపోలేదని.. అయితే గత కొన్ని రోజులుగా మరణాల రేటు పడిపోయినందున పార్కులలో తాత్కాలిక ఖననం ఆలోచనను విరమించుకున్నట్టు తెలిపారు. అవసరమైతే బ్రోనెక్స్ ద్వీపంలోని ఐలండ్ లో ఈ శవాలను పూడ్చి పెట్టి వస్తామని ఇబ్బంది లేదని తెలిపారు.

బ్రోనెక్స్ ద్వీపంలో  కావాల్సినంత విశ్రాంతి స్థలాలు - 50వేల ఖనన స్థలాల శ్మశాన వాటికలున్నాయి.  అందుకే ప్రత్యామ్మాయంగా ద్వీపంలో కరోనా శవాలను పూడ్చిపెట్టి వచ్చేందుకు అధికారులు ప్లాన్ చేస్తున్నారు.
Tags:    

Similar News