చత్తీస్ ఘడ్ ఎన్నికలు.. తెలుగు రాష్ట్రాల ఫోకస్

Update: 2018-10-29 08:48 GMT
యావత్ భారతం ప్రస్తుతం త్వరలో జరగబోయే ఐదు రాష్ట్రాల ఎన్నికలపైనే దృష్టిసారించాయి. సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్ లాంటి ఈ ఎన్నికల్లో ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీకే కేంద్రంలో అధికారం రావడం ఖాయంగా కనిపిస్తోంది. అందుకే రాజకీయ పార్టీలు - మీడియా ఫుల్ ఫోకస్ పెట్టి విస్తృతమైన ఏర్పాట్లు చేసుకుంటున్నాయి.

చత్తీస్ ఘడ్ లో జరగబోయే ఎన్నికలు తెలుగు రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే మావోలు ఏపీలో ఓ ఎమ్మెల్యేను హతమార్చాయి. నవంబర్ 12న చత్తీస్ ఘడ్ లో తొలి దశ పోలింగ్ జరగబోతోంది. తొలిదశలో నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలైన బస్తర్ - రాజ్ నంద్ గావ్ ఎన్నికలపై తెలంగాణ రాజకీయ పార్టీలు చర్చించుకుంటున్నాయి. ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా - తెలంగాణ ఖమ్మం జిల్లాల్లో బస్తర్ జిల్లాలో జరిగే ఎన్నికల ఎఫెక్ట్ కనపడుతోంది. అక్కడ ఎన్నికలను మావోలు అడ్డుకొని ఇటువైపు తీసుకొచ్చి ఏదైనా చేయవచ్చనే ప్రచారం జరుగుతోంది.

ఇప్పటికే మావోల గురించి.. చత్తీస్ ఘడ్ ఎన్నికల పరిణామాలపై తెలుగు రాష్ట్రాల జర్నలిస్టులు చత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని జర్నలిస్టులతో టచ్ లో ఉంటూ ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని పంచుకుంటున్నట్టు సమాచారం. మావోలు అక్కడి విధ్వంసాలను పక్కరాష్ట్రంలో చేయడం పరిపాటి కావడంతో చత్తీస్ ఘడ్ ఎన్నికల వేళ పొరుగున ఉన్న తెలంగాణ - ఏపీలో ఎలాంటి ఘటనలు చోటచేసుకుంటాయోనన్న ఆందోళన అందరిలోనూ నెలకొంది.ఎన్నికల సందర్భంగా ఏదైనా ముప్పు తలపెడితే వాటిని ఎలా ఎదుర్కొంటావాలనే దానిపై ఎన్నికల అధికారులు - పోలీసులు కసరత్తు చేస్తున్నారు.
    

Tags:    

Similar News