ప్రేమికులకు గుడ్ న్యూస్ చెప్పిన టీ.సర్కార్ !

Update: 2020-06-06 10:30 GMT
ఇప్పటి రోజుల్లో కులాంతర వివాహాలు బాగా ఎక్కువైయ్యాయి. ఎంతోమంది ప్రేమించి కులాలు , మతాలు అన్న తేడాలేకుండా పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. ఈ మధ్య యూత్ కూడా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ పై ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఇటువంటి సమయంలో ఇలా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకునేవారి పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.ఇక పై ఇంటర్కాస్ట్ పెళ్లిళ్లు చేసుకునే వారికి రూ.2.50 లక్షల నజరానా ఇవ్వనున్నట్టు ప్రకటించింది.

గతంలో కులాంతర వివాహాలు చేసుకున్న వారికి రూ. 50వేలు ఇచ్చేవారు. కాగా ఇప్పుడు దానిని ప్రభుత్వం ఏకంగా ఐదు రెట్లు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అయితే దీనికోసం ముందుగా పెళ్లి చేసుకునే జంట దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వివాహానికి సంబంధించిన ఆధారాలతో వారు స్థానిక జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ శాఖ ఉపసంచాలకుల కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకునే జంటలు ఈ ఆధారాలు సమర్పించాలి. వివాహం చేసుకున్న వధూవరులు మూడు ఫోటోలు, ఇద్దరివి కుల ధృవీకరణ పత్రాలు, స్కూల్ టీసీ, పదో తరగతి మార్క్స్ మెమో, వివాహ ధృవీకరణ పత్రం, వివాహం చేసుకున్న జంట జాయింట్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, వాహానికి సాక్షులుగా ఉన్నవారి వివరాలు, ఆదాయ ధ్రువీకరణ పత్రం, ఆధార్‌ కార్డు, రేషన్‌ కార్డు
Tags:    

Similar News