• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  తెలంగాణ అసెంబ్లీ...జస్ట్...

తెలంగాణ అసెంబ్లీ...జస్ట్ 8 నిమిషాలే

By - Tupaki Desk
Update: 2017-04-30 08:22 GMT
ఆదివారం పూట జ‌రిగిన తెలంగాణ అసెంబ్లీ ప్ర‌త్యేక స‌మావేశాలు నిజంగానే ప్ర‌త్యేక‌త‌ను సంత‌రించుకున్నాయి. కేవ‌లం 8 నిమిషాలు మాత్ర‌మే స‌భ న‌డిచి అనంత‌రం నిర‌వ‌ధిక‌ వాయిదా ప‌డింది. తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ప్రారంభం కాగానే స్పీకర్ అనుమతి మేరకు డిప్యూటీ సీఎం మహమూద్ అలీ రాష్ట్ర భూ సేకరణ బిల్లుకు సవరణలను ప్రతిపాదించారు. బిల్లును ఆమోదించాల్సిందిగా సభను కోరారు.

భూసేకరణ చట్ట సవరణల బిల్లును డిప్యూటీ సీఎం - రెవెన్యూ శాఖ మంత్రి మహముద్ అలీ ప్రవేశపెట్టిన అనంత‌రం మూజువాణి ఓటుతో భూసేకరణ చట్ట సవరణ బిల్లును ఆమోదిస్తున్నట్లు స్పీకర మధుసూదనాచారి ప్రకటించారు. అనంత‌రం స‌భ‌ను వాయిదా వేశారు. కేంద్రం సూచన మేరకు భూసేకరణ చట్టం బిల్లులో స్వల్ప మార్పులు చేశారు.

కాగా, భూసేకరణ బిల్లు సవరణకు కేంద్రం సూచించిన ప్రతిపాదనలను ఆమోదించడానికే ఆదివారం తెలంగాణ శాసనసభ, శాసనమండలి ఒకరోజు సమావేశాన్ని ఏర్పాటు చేశామని, ఉభయ సభల్లోనూ భూసేకరణ బిల్లు సవరణ అంశం తప్ప, మిగతావేవీ చర్చించేది లేదని ప్రభుత్వం ముందురోజే తేల్చిచెప్పింది. శనివారం శాసనసభలో సభాపతి మధుసూదనాచారి అధ్యక్షతన శాసనసభ వ్యవహారాల సలహా కమిటీ(బీఏసీ) సమావేశం జరిగింది. సమావేశాల నిర్వహణపై ప్రభుత్వం సమాచారం ఇస్తూ.. గతంలో చేసిన భూసేకరణ చట్టంపై కేంద్రప్రభుత్వం సూచించిన సవరణలు చేసేందుకే సమావేశం నిర్వహించాల్సి ఉన్నదని, కేవలం ఒక్క ఈ అంశానికే పరిమితమై సమావేశాన్ని పెట్టాలనుకుంటున్నట్లు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌ రావు బీఏసీ సభ్యులకు వివరించారు. ఈ సమావేశంలో ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి హరీశ్‌రావు, ఉపసభాపతి పద్మాదేవేందర్‌ రెడ్డి - ప్రతిపక్ష నేత కే జానారెడ్డి - ఆ పార్టీ ఎమ్మెల్యే చిన్నారెడ్డి - ఎంఐఎం నుంచి సయ్యద్ అహ్మద్ పాషాఖాద్రీ పాల్గొన్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Telangana Assembly 
  • 8 mins 
  • Telugu NEws 

Similar News

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

స్థానిక పీఠాల పై మంత్రుల సతీమణులు.. సర్పంచ్‌గా బీసీ జనార్దన్ రెడ్డి భార్య, ఎంపీపీగా మండిపల్లి సతీమణి!

2026-11-19 12:29 GMT

వైసీపీలో 'మూడు' నియ‌మాలు.. జ‌గ‌న్ స‌మాలోచ‌న‌!

2026-11-19 11:30 GMT

వెయ్యిమంది కాదు బ్రో.. ఒకే సారి 15 వంద‌ల మంది!

2026-11-19 10:30 GMT

ఏపీలో అన్ని పార్టీల‌కు ఇదే స‌మ‌స్యా... వార్నింగ్‌ల‌తో స‌రా..?

2026-11-19 10:03 GMT

విజ‌య‌న‌గ‌రం.. బాబు వ‌రం ఎవ‌రికి?

2026-11-19 09:55 GMT

కష్టజీవులకు భరోసా.. నిర్మాణ రంగానికి ఊతం : ఏపీలో ‘లేబర్ అడ్డా’ల విప్లవం!

2026-11-19 08:05 GMT

రూ.7 కోట్ల ఉద్యోగాల స్కాం : కుట్ర జరిగిందంటున్న జనసేన నేతలు.. అసలు నిజం ఇదే!

2026-11-19 08:02 GMT

ఆకాశంలో అంబానీ 'సిగ్నల్'.. మస్క్‌కు ఇక టెన్షన్ షురూ.. ఇప్పుడు స్పేస్‌లో శాటిలైట్ల జాతర

2026-11-19 06:00 GMT

వాన్స్‌కు షాక్ ఇవ్వనున్న ట్రంప్.. 2028 రేసులో రూబియో పేరు!

2026-11-19 05:37 GMT

ఛాతీ ఎముక కోయకుండానే బైపాస్ సర్జరీ.. భారతీయ రోబోతో అరుదైన ఆపరేషన్!

2026-11-19 05:32 GMT

Copyright @2026

Powered by Blink CMS