పంత్ ఈ ఏడాది క్రికెట్ కు దూరం.. కోలుకోవాలని సహచరుల పూజలు

Update: 2023-01-23 16:45 GMT
టీమిండియా యువ క్రికెటర్ రిషభ్ పంత్ గత నెల చివర్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో గాయపడిన సంగతి తెలిసిందే. తెల్లవారుజామున కావడం.. మంచి వేగంతో ఉన్నప్పుడు కునుకు రావడంతో ఈ ప్రమాదం సంభవించింది. వాస్తవానికి పంత్ ప్రమాద సీన్ చూసినవారికి అతడు ప్రాణాలతో బతికి ఉండడం ఆశ్చర్యమే. ఇందులో క్రికెటర్ కారు అత్యంత భద్రతా ప్రమాణాలతో కూడిన లగ్జరీది కావడం, సమయానికి అతడు స్పందించడం, రోడ్డున వెళ్లేవారు కాపాడడంతో ప్రాణ నష్టం జరగలేదు.

కాగా, ఈ ప్రమాదంతో పంత్ ఆస్ట్రేలియాతో వచ్చే నెలలో జరుగనున్న టెస్టు సిరీస్ కు దూరమయ్యాడు. నాలుగు టెస్టుల ఆ సిరీస్ కే కాక, మార్చి నుంచి జరిగే ఐపీఎల్ కూ పంత్
అందుబాటులో ఉండడు.2023 చేదు సంవత్సరమే అమ్మను ఆశ్చర్యపరచాలని, కొత్త సంవత్సరం రోజు సొంతింట్లో ఉండాలని భావించి పంత్ ఎవరికీ చెప్పకుండా ప్రయాణమయ్యాడు. బ్యాడ్ లక్ కొద్దీ ప్రమాదానికి గురయ్యాడు.

కాగా, అతడు 2020 డిసెంబరు 30న గాయపడగా.. ఆ ప్రభావం 2023 మొత్తం ఉండేలా కనిపిస్తోంది. పంత్ కుడి మోకాలి లిగ్మెంట్ దెబ్బతిన్నది. దీంతో పంత్ మొత్తం ఈ ఏడాది క్రికెట్ కు దూరం కానున్నాడు.

ఓ దశలో చికిత్స కోసం విదేశాలకు తరలిస్తారని అనుకున్నా.. ప్రస్తుతం ముంబైలోనే ఉన్నాడు. ఈ లెక్కన పంత్ ను మనం మళ్లీ మైదానంలో చూసేది 2024లోనే. అంటే 2023 అతడికి చేదు సంవత్సరమే.

సహచరుడు కోలుకోవాలంటూ..టీమిండియా క్రికెటర్లు మంగళవారం న్యూజిలాండ్ తో మూడో వన్డే ఆడనున్నారు. ఇందుకు ఇండోర్ వేదిక. మ్యాచ్ కోసం మధ్యప్రదేశ్‌ వచ్చిన ఆటగాళ్లు ప్రఖ్యాత ఉజ్జయిని ఆలయాన్ని దర్శించుకున్నారు. తమ సహచరుడు పంత్‌ కోలుకోవాలంటూ ప్రత్యేక పూజలు చేశారు.

ఈ పూజల్లో సూర్య కుమార్ యాదవ్, కుల్‌దీప్‌ యాదవ్, వాషింగ్టన్‌ సుందర్‌ పాల్గొన్నారు. సోమవారం తెల్లవారుజామున వీరు ఉజ్జయిని మహాకాళేశ్వర్‌ ఆలయాన్ని దర్శించుకున్నారు. పరమశివుడికి భస్మా హారతి సమర్పించారు. ‘‘పంత్‌ త్వరగా కోలుకోవాలని మేం ఆ భగవంతుడిని ప్రార్థించాం. అతడు జట్టులోకి తిరిగిరావడం టీమ్‌ఇండియాకు చాలా ముఖ్యం’’ అని మిస్టర్ 360 సూర్యకుమార్‌ తెలిపాడు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News