విదేశీ ఫోన్ నెంబర్లతో స్వదేశీ చెల్లింపులు.. అదెలానంటే?

ఇటీవల కాలంలో పెరిగిన డిజిటల్ చెల్లింపుల నేపథ్యంలో.. గ్లాస్ టీ పేమెంట్ కు పర్సులోని డబ్బుల కంటే.. మొబైల్ ఫోన్ వాలెట్ లో ఉండే డబ్బులతోనే పేమెంట్ చేస్తున్న సంగతి తెలిసిందే.

Update: 2024-05-07 12:30 GMT

దేశం ఏదైనా కావొచ్చు.. భారతదేశంలో పర్యటిస్తున్న వేళ.. ఇక్కడి యూపీఏ పేమెంట్లకు చేసేందుకు అవకాశం లేదు. ఇటీవల కాలంలో పెరిగిన డిజిటల్ చెల్లింపుల నేపథ్యంలో.. గ్లాస్ టీ పేమెంట్ కు పర్సులోని డబ్బుల కంటే.. మొబైల్ ఫోన్ వాలెట్ లో ఉండే డబ్బులతోనే పేమెంట్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. భారత్ లో ఉండే ప్రవాస భారతీయులు తమ అంతర్జాతీయ మొబైల్ నెంబర్లతో యూపీఏ సేవల్ని ఉపయోగించుకునే సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది ప్రముఖ ప్రైవేటు బ్యాంక్ ఐసీఐసీఐ.

ఎన్ ఆర్ ఐ ఖాతాదారులు తమ ఎన్ఆర్ఐ లేదంటే ఎన్ ఆర్ వో బ్యాంకు ఖాతాను లింక్ చేసిన పక్షంలో తమ అంతర్జాతీయ మొబైల్ నెంబరుతోనూ యూపీఏ చెల్లింపులు చేసుకునే సౌలభ్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఐసీఐసీఐ బ్యాంక్ మొబైల్ బ్యాంకింగ్ యాప్ ఐమొబైల్ పే ద్వారా ఈ సేవల్ని అందుబాటులో ఉండనున్నట్లుగా పేర్కొన్నారు. అమెరికా.. బ్రిటన్.. దుబాయ్.. సింగపూర్.. కెనడా.. ఆస్ట్రేలియా.. హాంకాంగ్..ఖతార్.. సౌదీ ఇలా పది దేశాలకు చెందిన ఎన్ఆర్ఐలు యూపీఐ సేవల్ని వాడుకునేలా ఐసీఐసీఐ కొత్త విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.

Read more!

గతంలో విదేశాల్లో నివసించే భారతీయులు యూపీఐ చెల్లింపుల కోసం స్వదేశీ ఫోన్ నెంబర్లను మాత్రమే వినియోగించాల్సి ఉండేది. అందుకు భిన్నంగా ఇప్పుడు పది దేశాల్లో (అమెరికా.. బ్రిటన్.. యూఏఈ.. కెనడా.. సింగపూర్.. ఆస్ట్రేలియా.. హాంకాంగ్.. ఒమన్.. ఖతార్.. సౌదీ) నివసిస్తున్న భారతీయులు తమ విదేశీ ఫోన్ నెంబరును లింకు చేసుకుంటే.. యూపీఐ సేవల్ని పొందే వీలుంది. ప్రపంచం వ్యాప్తంగా యూపీఐ చెల్లింపుల వ్యవస్థను బలోపేతానికి ఇది సాయం చేస్తుందంటున్నారు. ఎన్ఆర్ఐలకు మేలు చేసే ఈ సౌకర్యం గురించి అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.

Tags:    

Similar News