తిరుపతిలో ప్రచారం మొదలుపెట్టబోతున్న టీడీపీ
తొందరలో జరగబోయే తిరుపతి లోక్ సభ ఉపఎన్నికల్లో టీడీపీ ప్రచారం మొదలుపెట్టబోతున్నది. ఇందులో భాగంగానే ఈనెల 17వ తేదీన తిరుపతిలో పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. అంటే లోక్ సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లకు తిరుపతిలో ఏర్పాటు చేయబోయే కార్యాలయం సెంట్రల్ ఆఫీసులాగ ఉండబోతోంది. ఇక్కడి నుండి మొత్తం ఎన్నికల వ్యవహారాలను పర్యవేక్షించబోతున్నారు నేతలు.
ఎలాగైనా లోక్ సభ స్ధానాన్ని గెలవాలన్న టార్గెట్ పెట్టుకుని నేతలకు పని విభజన చేశారు. గ్రామస్ధాయి నుండి నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్ వరకు వివిధ స్ధాయిలో పార్టీ కమిటీలను వేయాలని డిసైడ్ చేశారు. తిరుపతి లోక్ సభ పరిధిలోని నేతలతో చంద్రబాబునాయుడు మాట్లాడుతూ మొత్తం 70 క్లస్టర్లను ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. అలాగే 9, 10, 11 తేదీల్లో పార్టీ నేతలంతా సమావేశమై నియోజకరవ్గాల స్ధాయి కమిటీలను నియమించుకోవాలని చెప్పారు.
నిజానికి అంతకుముందే లోక్ సభ నియోజకవర్గ సమన్వయకమిటి ఛైర్మన్ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో కమిటి సభ్యులు సమావేశమయ్యారు. గ్రామస్ధాయి నుండి నియోజకవర్గ స్దాయి వరకు కమిటిల ఏర్పాటుపై చర్చించారు. తర్వాత చంద్రబాబు ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో సోమిరెడ్డి తమ సమావేశం వివరాలను చెప్పారు. 17వ తేదీన తిరుపతిలో ఏర్పాటుచేయబోయే పార్టీ కార్యాలయాన్ని రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రారంభించనున్నట్లు చెప్పారు.
అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే తాను కానీ లేద నారా లోకేష్ కానీ ఎప్పటి నుండి ప్రచారంలోకి దిగేది చంద్రబాబు చెప్పలేదు. అలాగే అభ్యర్ధి పనబాక లక్ష్మి ప్రచారం మొదలుపెట్టే విషయంపైన కూడా క్లారిటి ఇవ్వలేదు. అభ్యర్ధి ప్రచారంలోకి దిగకుండా తాము రంగంలోకి దిగటం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదని చాలామంది సీనియర్ నేతలు దూరంగా ఉండిపోయారు. మరి పార్టీ నేతలకు ఈ విషయంలో చంద్రబాబు ఎందుకని క్లారిటి ఇవ్వలేదో అర్ధం కావటం లేదు.