• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  మండలిలో బిల్లును టీడీపీ...

మండలిలో బిల్లును టీడీపీ అడ్డుకుంటే ఏం జరుగుతుంది?

By - Tupaki Desk
Update: 2020-01-20 02:53 GMT
ఏపీకి మూడు రాజధానుల ఏర్పాటు కు సంబంధించిన బిల్లును తాజాగా ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేందర్ రెడ్డి శాసనసభలో ప్రవేశపెట్టారు. ఏపీకి పరిపాలన రాజధానిగా విశాఖ, శాసన రాజధానిగా అమరావతి, న్యాయరాజధానిగా కర్నూలును ఏర్పాటు చేస్తూ బిల్లు ప్రవేశపెట్టారు.

అయితే అమరావతి నుంచి రాజధాని మార్పును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న తెలుగుదేశం పార్టీని శాసన మండలిలో బలం ఉండడంతో అడ్డుకోవడానికి వ్యూహరచన చేస్తోంది.

శాసన మండలిలో వైసీపీకి బలం లేదు. టీడీపీకి ఎమ్మెల్సీలు ఎక్కువగా ఉన్నారు.  దీంతో ఏపీకి 3 రాజధానుల బిల్లును శాసన మండలిలో అడ్డుకోవడానికి రెడీ అయ్యింది.  

అయితే వాస్తవంలో మండలిలో బిల్లును తిప్పికొట్టినా కూడా టీడీపీ ఈ రాజధానుల బిల్లును అడ్డుకోలేదని నిపుణులు సూచిస్తున్నారు. ఒకవేళ మండలిలో ఈ రాజధానుల బిల్లును తిరస్కరించినా.. సవరణలు ప్రతిపాదించినా.. 3 నెలలు ఎలాంటి నిర్ణయం తీసుకోకున్నా.. తిరిగి శాసనసభకు వస్తుంది. అసెంబ్లీ గతంలో పాస్ చేసిన బిల్లును మళ్లీ పాస్ చేసి చట్టంగా మార్చే హక్కు శాసనసభకు ఉంటుంది. శాసనసభలో 151 మంది ఎమ్మెల్యేలు ఉండడంతో 3 రాజధానుల బిల్లు చట్టం రూపు దాల్చడం ఖాయం. అయితే కొంత ఆలస్యం కావచ్చు తప్పితే శాసనమండలిలో టీడీపీ ఈ 3 రాజధానులను అడ్డుకోవడం కష్టమేనని నిపుణులు చెబుతున్నారు.

ఇలా సాంకేతిక కారణాలతో మూడు నెలల వరకూ మాత్రమే టీడీపీ అడ్డుకోగలదు. కానీ బిల్లును తిరస్కరించే అధికారం మాత్రం టీడీపీకి ఉండదని తేలింది.


Tags:    
  • TDP Leaders 
  • Three Capital bill 
  • Andhra legislative Council 

Similar News

147 కోట్లకు చేరిన భారత్ జనాభా.. మరో 40 ఏళ్లలో ఎంతంటే?

2026-11-20 05:08 GMT

అమెరికాలో టెక్ సమస్యల ఎఫెక్ట్.. సైబర్ డైరెక్టర్‌పై వేటు!

2026-11-20 05:07 GMT

జటాయు కేంద్రానికి పెరిగిన రద్దీ.. రోజుకు 7 వేల మంది సందర్శకులు!

2026-11-20 05:07 GMT

అయ్యప్ప దీక్షలో ఉన్న ఉద్యోగికి టీసీఎస్‌లో నో ఎంట్రీ.. ఆదిభట్లలో ఆందోళన.. అసలు వివాదం ఏంటి?

2026-11-20 05:06 GMT

భార్యకు తెలియకుండా ఇంట్లోకి ఇతర పురుషులు.. 13 ఏళ్ల పాటు భర్త అరాచకం!

2026-11-20 05:03 GMT

దాదాపు 50 ఏళ్లుగా అంతరిక్షంలో ప్రయాణం.. వాయేజర్-1లో భూమి నుంచి పంపిన ఓ అరుదైన సందేశం!

2026-11-20 04:37 GMT

హైదరాబాద్‌లో పోడ్ కార్లు.. ఐటీ ఉద్యోగుల ప్రయాణ కష్టాలు తగ్గుతాయా?

2026-11-20 04:15 GMT

జడ్పీ పీఠాలు : టీడీపీకి 22, జనసేనకు 4, బీజేపీకి 1

2026-11-20 03:36 GMT

యూత్ కి బీపీ షుగర్...ఏంటీ జనరేషన్ !

2026-11-20 03:36 GMT

బీఆర్ఎస్ కి రాజకీయ సిద్ధి...అక్కడే రేవంత్ గురి !

2026-11-20 03:35 GMT

పిచ్చికుక్క కరిచిందా.. ఎర్రగడ్డకు పంపిస్తాం.. కోమటిరెడ్డికి రేవంత్ రెడ్డి పరోక్ష పంచ్.. కాంగ్రెస్‌లో మాటల మంటలు

2026-11-19 21:30 GMT

విశాఖ నుంచి తిరుపతి వెళ్ళే భక్తులకు సూపర్ న్యూస్

2026-11-19 21:15 GMT

Copyright @2026

Powered by Blink CMS