టీడీపీ టికెట్లు.. ఈసారి వారసులకే..

Update: 2019-03-15 04:53 GMT
ఏపీలో టీడీపీ అసెంబ్లీ అభ్యర్థుల తొలి జాబితాలో విడుదలైంది. ఇందులో యువత్సోహం వెల్లివిరిసింది.. చాలామంది సీనియర్ నేతల వారసులకు టికెట్లు దక్కాయి. ఈసారి మొత్తం 83 మంది సిట్టింగులకు టికెట్లు దక్కాయి.  ఇందులో 15మంది మహిళలలున్నారు.

చంద్రబాబు గురువారం అర్థరాత్రి విడుదల చేసిన జాబితాలో మొత్తం 126మంది పేర్లు ప్రకటించారు.  కొంత మంది సిట్టింగుల నియోజకవర్గాల సీట్లు మారాయి. మంత్రా గంటా ఆనవాయితీ ప్రకారం భీమిలి నుంచి విశాక ఉత్తర నియోజకవర్గానికి మారారు. ఇక విజయవాడ పశ్చిమ, గుంటూరు తూర్పు నియోజకవర్గాలను మైనారిటీకి దక్కాయి.

వృద్ధాప్యం, అనారోగ్యం,  క్రియాశీలంగా లేని కారణంగా చాలా మంది సీనియర్లు ఈసారి తమకు టికెట్ వద్దని వారసులకు అవకాశం ఇవ్వాలని కోరారు. దీంతో వారి కోరిక మేరకు ఈసారి టీడీపీ భారీ సంఖ్యలో వారసులకు టికెట్లను కేటాయించింది.

* సీనియర్ల స్థానంలో వారుసుల వీరే..
1. డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి- పత్తికొండ నియోజకవర్గంలో ఆయన స్థానంలో కేఈ శ్యాంబాబు,
2. మంత్రి పరిటాల సునీత- రాప్తాడ్ స్థానంలో ఆమె కుమారుడు శ్రీరాం..
3.మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి-శ్రీకాళహస్తి స్థానంలో ఆయన కుమారుడు సుధీర్ రెడ్డి
4.గౌతు శ్యాంసుందర శివాజీ-పలాస స్థానంలో ఆయన కుమార్తె శిరీషా
5.జలీల్ ఖాన్-విజయవాడ పశ్చిమ స్థానంలో ఆయన కుమార్తె షబానా ఖాతూన్
6.కిడారి సర్వేశ్వరరావు -అరకు స్థానంలో ఆయన కుమారుడు శ్రావణ్ కుమార్
7.దివంగత గాలి ముద్దుకృష్ణమ నాయుడు -నగరి స్థానంలో ఆయన వారసుడు భాను ప్రకాష్
8. కిమిడి మృణాళిని-చీపురుపల్లి స్థానంలో ఆమె కుమారుడు నాగార్జున
9. దివంగత దేవినేను నెహ్రూ- గుడివాడ స్థానంలో అవినాష్
10.దివంగత ఎర్రనాయుడు- రాజమండ్రి నగరం స్థానంలో భవానీ
    

Tags:    

Similar News