• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ఇసుక మాఫియా పై టీడీపీ...

ఇసుక మాఫియా పై టీడీపీ చార్జిషీట్

By - Tupaki Desk
Update: 2019-11-12 07:44 GMT
ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం రాజకీయం మొత్తం ఇసుక చుట్టూనే తిరుగుతుంది. ప్రస్తుతం రాష్ట్రం లో ఇసుక ప్రధాన సమస్య గా మారిన విషయం తెలిసిందే. దీన్ని ఏపీ ప్రభుత్వం కూడా అంగీకరించింది. రాష్ట్రం లో ఈ ఏడాది అనుకున్న కాడికి కొంచెం ఎక్కువ గానే వర్షాలు కురవడం తో నదులన్నీ కూడా నీటి తో నిండి పోయి కనిపిస్తున్నాయి. దీనితో కొన్ని రోజులు ఆగితే మళ్ళీ అందరికి ఇసుక అందుబాటు లోకి వస్తుంది అని ప్రభుత్వం చెప్తుంది. కానీ , ప్రతిపక్షాలు మాత్రం రాష్ట్రం లో ఇసుక కొరత కి ప్రధాన కారణం ప్రభుత్వమే అని ఆరోపణలు చేస్తుంది.

ఇకపోతే రాష్ట్రం లో ఇసుక దొరకక పోవడంతో పనులులేక కార్మికులు ఆత్మ హత్యలకి పాల్పడుతున్నారు. కార్మికులకు అండగా ..ఇసుక కుత్రిమ కొరత పై రాజకీయ పక్షాల మద్దతు తో 14 న విజయవాడ లో టీడీపీ అధినేత చంద్రబాబు దీక్ష చేయబోతున్నారు. ఈ తరుణంలో జిల్లాల వారీగా ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారంటూ వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రుల పేర్లని టీడీపీ విడుదల చేసింది. మొత్తం గా ఏపీలో ఉన్న 13 జిల్లాలలో  60 మంది ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్య నాయకుల పేర్లని ప్రకటించి ..వీరి వల్లే రాష్ట్రం లో ఇసుక కొరత ఏర్పడింది అంటూ సంచలన ఆరోపణలు చేసింది. ఈ ఇసుక కొరత పై టీడీపీ ఎమ్మెల్యే అచ్చం నాయుడు మాట్లాడుతూ .. వైసీపీ నేతలు ఇసుకను ఇతర రాష్ట్రాలకు తరలించారు అని , దానికి తగిన ఆధారాలు కూడా ఉన్నాయని చెప్పారు. సరైన ఆధారాలు లేకుండా టీడీపీ ఇసుక అక్రమ రవాణా పై ఆరోపణలు చేయడం లేదు అని తెలిపారు. అలాగే మాజీ మంత్రి ఆలపాటి రాజా  కూడా రాష్ట్రం లో ఇసుక కొరత ఏర్పడటానికి ప్రధాన కారణం ప్రభుత్వ ఎమ్మెల్యే లే అని , వారి ప్రమేయం తోనే ఇసుక రాష్ట్రం దాటి పోతుంది అని సంచలన వ్యాఖ్యలు చేసారు. అలాగే ప్రభుత్వం ఏమి చేయక పోతే గత 70 ఏళ్ళ నుంచి రాని కొరత ఇప్పుడే ఎందుకు వచ్చింది అంటూ ప్రశ్నించారు.
Tags:    
  • Sand 
  • Sand Mafia 
  • Andhra News 
  • Andhra News Updates 
  • Andhra Daily News 
  • Telugu News 
  • Telugu News Upadtes 
  • Andhra Politics 
  • Andhra Pradesh Politics 
  • Telugu News 
  • Tupaki News 
  • Cbn 

Similar News

డేటింగ్ నుంచి వివాహం వరకు.. నేటి యువత మైండ్‌సెట్‌పై ప్రభుత్వం ఫోకస్!

2026-11-05 08:08 GMT

క్రెడిట్ ఎంపీ భరత్ కేనా ?

2026-11-05 08:06 GMT

ఏబీవీ మీడియా పులేనా.... గ్రౌండ్‌లో రాజకీయ బలం లేదా ?

2026-11-05 07:54 GMT

కాంగ్రెస్‌కు షర్మిల అవసరముందా...జగన్‌ను టార్గెట్ చేయడమే రాజకీయమా ?

2026-11-05 07:29 GMT

స్థానిక ఎన్నికల్లో జగన్ గెలిచి 2024లో ఓడారు....కూటమికి అదే పరిస్థితి ఎదురవుతుందా ?

2026-11-05 07:15 GMT

ఏం చూడకుండానే ఏఐ ద్వారా ఉత్తర్వులు.. అధికారులకు హైకోర్టు మొట్టికాయలు..

2026-11-05 07:14 GMT

అమెరికా ఎన్నికల ఎఫెక్ట్.. భారత స్టాక్ మార్కెట్లలో భారీ ర్యాలీ.. ఇన్వెస్టర్లకు రూ.6 లక్షల కోట్ల లాభం!

2026-11-05 06:54 GMT

హైడ్రా రంగనాథ్ నెక్ట్స్ టార్గెట్ ఇదే..

2026-11-05 06:52 GMT

పాతపగలన్నీ మాని ట్రంప్ కు వేల కోట్లు ఇచ్చినా.. పాపం ఎలన్ మస్క్ పరిస్థితి ఇదీ

2026-11-05 06:37 GMT

ఇక.. 100 ప‌ర్సంట్ దూకుడే.. !

2026-11-05 06:27 GMT

అసెంబ్లీ కంటే ఘోర‌మా.. జ‌గ‌న్‌.. నెక్ట్స్ ఏంటి.. ?

2026-11-05 06:25 GMT

వైసీపీలో అంత‌ర్గ‌త పోరు.. నెల్లూరు మునక‌.. !

2026-11-05 06:23 GMT

Copyright @2026

Powered by Blink CMS