కేసీఆర్‌ను దెబ్బ కొట్టేందుకు ''అసిఫాబాద్‌'' ఫార్ములా..?

Update: 2015-07-06 08:26 GMT
రోజురోజుకీ బలోపేతం అవుతున్న తెలంగాణ అధికారపక్షానికి ముకుతాడు వేసేందుకు.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కంట్రోల్‌ చేసేందుకు సరికొత్త రాజకీయ ఫార్ములా అవసరం అవుతుందా? ఆ దిశగా అడుగులు పడుతున్నాయా? అన్న ప్రశ్న రేకెత్తేలా తాజాగా ఒక పరిణామం చోటు చేసుకుంది.

అదిలాబాద్‌ జిల్లాలోని ఐదు పంచాయితీల్ని సొంతం చేసుకున్న టీఆర్‌ఎస్‌.. అసిఫాబాద్‌ మేజర్‌ పంచాయితీని మాత్రం చేజిక్కించుకోలేకపోయింది. ఈ పంచాయితీని కాంగ్రెస్‌ పార్టీ సొంతం చేసుకుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో టీఆర్‌ఎస్‌ను కంట్రోల్‌ చేసి.. కాంగ్రెస్‌ ఒక స్థానాన్ని ఎలా కైవశం చేసుకుందన్న ఆసక్తి పలువురు వ్యక్తం చేస్తున్నాయి.
Tags:    

Similar News