టాటా.. అపాచీ ఎవరొచ్చినా కేసీఆర్ అంతే!
ఏదైనా రాష్ట్రానికి ఒక ప్రముఖ కంపెనీ వస్తుందన్నా.. ఒక వ్యాపార దిగ్గజం వస్తున్నారంటే.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హాజరు పక్కాగా ఉంటుంది. ఇంకాస్త అవకాశం ఉంటే.. సదరు పారిశ్రామిక దిగ్గజం మనసు దోచుకునేందుకు ఏమేం చేయాలో అలాంటివి చేసే ప్రయత్నం చేస్తారు. రాష్ట్ర ఇమేజ్ ను పెంచేలా మరిన్ని ప్రాజెక్టులకు పెట్టుబడులు పెట్టాలని కోరటం కనిపిస్తుంటుంది.
కానీ.. దేశంలోనే గర్వించదగిన పారిశ్రామిక దిగ్గజం వచ్చినా..అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులున్న కంపెనీ తన ఉత్పత్తుల్ని రాష్ట్రంలో ప్రారంభిస్తుంటే.. ఆ కార్యక్రమానికి సీఎం రాకుండా ఉండటం ఎక్కడా సాధ్యం కాదంటారు. కానీ.. తెలంగాణ రాష్ట్రంలో అలాంటివి చాలా మామూలే. గతంలో రతన్ టాటా కహాజరైన కార్యక్రమానికి ముఖ్యమం త్రి కేసీఆర్ గైర్హాజరు కావటం తెలిసిందే.
తాజాగా వైమానికి రంగంలో కీలకమైన అడుగ్గా అభివర్ణించే టాటా అడ్వాన్స్ సిస్టం అండ్ బోయింగ్ జాయింట్ వెంచర్ అధ్వర్యంలో ఆదిభట్లలో ఏర్పాటు చేసిన బోయింగ్ విమానాల విడిభాగాల తయారీ పరిశ్రమ ఉత్పత్తి ప్రారంభించింది. దీనికి కేంద్ర రక్షణ శాఖామంత్రి నిర్మలా సీతారామన్ ఢిల్లీ నుంచి వచ్చారు. ముంబయి నుంచి రతన్ టాటా వచ్చారు. ఇక.. బోయింగ్ సంస్థకు చెందిన ప్రముఖులు వచ్చారు.
అందరూ వచ్చారు కానీ.. తెలంగాణరాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం హాజరు కాకపోవటం గమనార్హం. రాష్ట్రం తరఫున మంత్రి కేటీఆర్ హాజరై.. ప్రసంగించారు. ఆదిభట్లలో 13 ఎకరాల్లో రూ.200 కోట్లతో ప్రారంభించిన ఈ పరిశ్రమ బోయింగ్ ఏహెచ్ -64 విమానాల విడిభాగాలతో పాటు అపాచీ హెలికాఫ్టర్లను తయారు చేయనున్నారు. ఈహెలికాఫ్టర్లకు అమెరికాతో సహా 15 దేశాల్లో గిరాకీ ఉందని చెబుతారు. మరి.. ఇంతటి కీలకమైన కార్యక్రమానికి తెలంగాణ సీఎం కేసీఆర్ హాజరు కాకపోవటం విశేషం. ఇదే విషయాన్ని పార్టీ వర్గాల దగ్గర ప్రస్తావిస్తే. . చాలా సింఫుల్ గా.. కేటీఆర్ ఉన్నారుగా.. ఆయన చూసుకుంటారన్న మాట చూస్తే.. కేసీఆరా.. మజాకానా అన్న భావన కలగటం ఖాయం.