జూబ్లీహిల్స్ లో పబ్ లపై టాస్క్ ఫోర్స్ దాడులు

Update: 2020-11-07 09:10 GMT
కరోనా కల్లోలం వేళ అన్నింటిని ప్రభుత్వాలు నియంత్రించాయి. ఇప్పుడు అన్ లాక్ లలో మళ్లీ నిబంధనలు సడలించడంతో అన్ని పున: ప్రారంభమవుతున్నాయి. ఈ క్రమంలోనే కరోనా నిబంధనలు కనీసం పాటించకుండా విచ్చలవిడిగా వ్యవహరిస్తున్న పలు పబ్ లపై పోలీసులు దాడులు చేశారు.

జూబ్లీహిల్స్ లోని పలు పబ్ లపై వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న పబ్ లపై పోలీసులు కొరఢా ఝలిపించారు.

నిబంధనలు బేఖాతరు చేస్తూ అర్థరాత్రి వరకు నిర్వహిస్తున్న పబ్బులపై చర్యలు తీసుకున్నారు. ఈ క్రమంలోనే జూబ్లీహిల్స్ లోని నాలుగు పబ్ లపై దాడులు చేసి కేసులు నమోదు చేశారు. ఇవన్నీ అనుమతులు లేకుండా డాన్స్ ఫ్లోర్ ను తేవడం.. కోవిడ్ నిబంధనలు పూర్తిగా బేఖాతరు చేసినట్టు తెలిసింది. మాస్కులు కూడా లేకుండానే పబ్బుకు అనుమతించడం చేస్తున్నాయని పోలీసులు పేర్కొన్నారు.

నో మాస్క్ నో ఎంట్రీ అనే విధానానికి స్వస్తి చెప్పిన ఈ పబ్బు యజమానులు విచ్చలవిడిగా కరోనా వ్యాపించేలా ప్రోగ్రాంలు నిర్వహించడం.. డబ్బుల కోసం అన్నీ నిబంధనలు తుంగలో తొక్కినట్టు పోలీసులు తెలిపారు. అందుకే దాడులు చేసినట్టు వివరించారు.
Tags:    

Similar News