సీనియర్ టీడీపీ నేత కన్నుమూత
టీడీపీ సీనియర్ నేత కన్నుమూశారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మాజీ ఎమ్మెల్యే వైటీ రాజా తుదిశ్వాస విడిచారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచాడు.
ఇటీవలే వైటీ రాజా కరోనా బారిన పడి కోలుకున్నారు. అయితే అనారోగ్యం వెంటాడి మరణించారు. రాజా మృతితో కుటుంబ సభ్యులు, అనుచరులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.
విషయం తెలుసుకున్న పలువురు కార్యకర్తలు, జిల్లాకు చెందిన నేతలు హైదరాబాద్ కు పయనమయ్యారు. రాజా మృతిపట్ల టీడీపీ అధినేత చంద్రబాబు, ఎమ్మెల్సీ నారా లోకేష్, పలువురు టీడీపీ నేతలు సంతాపం తెలిపారు.
తెలుగుదేశం పార్టీ తరుఫున పోటీచేసి వైటీ రాజా 1999లో తణుకు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత 2004, 2009లో టీడీపీ నుంచే పోటీచేసి ఓడిపోయారు. 2014 నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు.