రేవంత్ రెడ్డి చాలెంజెస్ కూడా స్వీకరిస్తారా?
సాఫ్ట్ నేత అయిన భట్టి విక్రమార్క్ చాలెంజ్ ను స్వీకరించిన టీఆర్ ఎస్.. హార్డ్ కోర్ ఫైర్ బ్రాండ్ అయిన రేవంత్ రెడ్డి సవాళ్లను ఎందుకు స్వీకరించరు. భట్టి మాటలు గాయంపై యాంట్ మెంట్ పూసినట్టు ఉంటాయి కాబట్టి అతడికి టీఆర్ ఎస్ క్లారిటీ ఇచ్చింది. అదే రేవంత్ మాటలు పుండుపై కారం చల్లినట్టు ఉంటాయి. అందుకే అతడికి టీఆర్ ఎస్ స్పందించడం లేదా? భట్టి చాలెంజ్ ను స్వీకరించినట్టే రేవంత్ చాలెంజెస్ కూడా స్వీకరిస్తారా అన్న చర్చ ఇప్పుడు తెలంగాణలో సాగుతోంది.
తెలంగాణలో కేసీఆర్ పరిపాలన మీద ప్రజలకు ఇంకా క్లారిటీ రాపోయినా అంత వ్యతిరేకత కూడా ఏమీ లేదు. క్షేత్రస్థాయిలో ఎన్నికలు లేవు కాబట్టి అవి బయటపడే చాన్స్ ఇప్పట్లో లేదు. తెలంగాణ పాలిటిక్స్ మీద తెలుగు మీడియా కూడా అంత పెద్దగా చర్చలు పెట్టవు. తెలంగాణలో పొలిటికల్ గా మామూలు టైంలో పెద్దగా నాయకులు స్పందించరు. అందుకేనేమో.. తెలుగు మీడియాలో తెలంగాణ వార్తలకు ప్రాధాన్యత ఇవ్వరు. అది కూడా కేసీఆర్ కు అడ్వంటేజే. ఎందుకంటే ప్రతీదానికి వార్తల్లో చూపిస్తే ప్రభుత్వానికి కొంచెం ఇబ్బంది ఎదురవుతుంది కాబట్టి అది కూడా కేసీఆర్ కు లాభమే..
అసలు విషయానికి వస్తే కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క అసెంబ్లీ సమావేశాల్లో జీహెచ్ ఎంసీ పరిధిలో డబుల్ బెడ్ రూంలపై కేసీఆర్ హామీ ఇచ్చారని.. లక్ష ఇళ్లు కట్టిస్తానన్నాడని.. ఏవీ ఆ ఇళ్లు అంటూ కాస్త గట్టిగానే ప్రశ్నించారు.
దీనికి స్పందించిన సిటీ పరిధిలోని మంత్రి తలసాని నేను చూపిస్తా అని నిన్న భట్టి విక్రమార్క ఇంటికి స్వయంగా వెళ్లి అతడిని తీసుకొని వెళ్లి 4000 వరకు డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణాలను చూపించాడు. మిగతావి రాబోయే రెండు రోజుల్లో చూపిస్తాం అని భట్టికి హామీ ఇచ్చాడు. లక్ష డబుల్ బెడ్ రూం ఇళ్లు చూపిస్తారా లేక ఏమీ చేస్తారో చూడాలి.
భట్టి విక్రమార్క్ ఒక క్లాస్ లీడర్. సొంత పలుకుబడితో రాజకీయాల్లో రాణించాడు. పెద్దగా ఎవరిని తీవ్ర పదజాలంతో విమర్శించడు. క్లాస్ లీడర్ కాబట్టి అతడిని తలసాని తీసుకొని వెళ్లాడు.
అదే రేవంత్ రెడ్డి ఎన్నో సార్లు చాలెంజ్ లు చేశాడు. అతడిని తీసుకొని వెళ్లి కాంగ్రెస్ నోరు మూయించవచ్చు కదా అని తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే చర్చ జరుగుతోంది. రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డి చాలెంజ్ లు కూడా స్వీకరిస్తారో లేదో చూడాలి మరి. ఏది ఏమైనా ప్రజలకు మెరుగైన పాలన అందించాలని మీడియా వర్గాలు అంటున్నాయి.