వెధవ పనుల వల్లే నీపై దాడి.. అక్బర్ పై తలసాని తనయుడి అటాక్

Update: 2020-01-22 04:46 GMT
టీఆర్ఎస్-మజ్లిస్ మంచి ఫ్రెండ్స్.. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీల మధ్య మంచి స్నేహబంధం ఉంది. ఇద్దరూ ఎన్నికల్లో రాజకీయాల్లో కలిసి సాగుతుంటారు. కానీ అసదుద్దీన్ సోదరుడు, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ కు మాత్రం టీఆర్ఎస్ పార్టీ అంటే గిట్టదు. అన్నయ్యతో ఎప్పుడూ విభేదిస్తూనే ఉంటాడు. టీఆర్ఎస్ ను తిడుతూనే ఉంటాడు.

తాజాగా మున్సిపల్ ఎన్నికల ప్రచారంలోనూ గులాబీ పార్టీపై, కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు. ఎంఐఎంతో ఉన్న స్నేహం దృష్ట్యా దీనిపై కేసీఆర్ కానీ మంత్రులు కానీ స్పందించలేదు.

అయితే ఆవేశం ఆపుకోలేని మంత్రి తలసాని తనయుడు సాయినాథ్ యాదవ్ మాత్రం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ పై నోరుపారేసుకున్నారు. ‘అక్బరుద్దీన్ కు రెండు బుల్లెట్లు తగిలాయి. ఛాతీపై నాలుగు కత్తిపోట్లు పడ్డాయి. స్వాతంత్ర్యం పోరాటం చేస్తున్నందుకు నీపై దాడి జరగలేదు. వెధవ పనులు చేస్తున్నావు కాబట్టే జరిగింది. మీతో మాకు పొత్తు లేదు. మనం మిత్రపక్షం మాత్రమే.. మీకు , మాకు సరిదూరమే ఉంది’ అంటూ ఫైర్ అయ్యారు.

తలసాని తనయుడు సాయినాథ్ మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అకర్బుద్దీన్ పై పరుష వ్యాఖ్యలు చేసిన సాయినాథ్ హాట్ టాపిక్ గా మారారు.
Tags:    

Similar News