ఏపీ ప్రజలకు స్వీట్ న్యూస్.. కర్నూలుకు ఫ్లైట్ లో వెళ్లొచ్చు
ఏపీ ప్రజలకు శుభవార్త చెప్పింది కేంద్రంలోని మోడీ సర్కారు. మరి.. ముఖ్యంగా కర్నూలు ప్రజలైతే పండుగే చేసుకునే పరిస్థితి. ఎన్నో ఏళ్లు ఎదురుచూస్తున్న కల నిజం కావటమే కాదు.. మరో రెండు నెలల్లో కళ్ల ముందు విమానాలు వచ్చేసే పరిస్థితి రావటానికి మించిన ఆనందం ఏముంటుంది? కర్నూలులో కొత్తగా నిర్మించిన విమానాశ్రయంలో విమానాల రాకపోకలకు కేంద్రం ఓకే చెప్పేసింది.
తాజాగా దీనికి సంబంధించి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అనుమతి లభించింది. ఈ ఏడాది మార్చి నుంచి విమానాల రాకపోకలు.. వాటి కార్యకలాపాలకు ఏరోడ్రోమ్ లైసెన్స్ జారీ చేసినట్లుగా కర్నూలు ఎయిర్ పోర్టు అధికారులు వెల్లడించారు. దీంతో.. ప్యాసింజర్ విమానాల రాకపోకలు చాలా తొందర్లోనే షురూ అవుతాయని చెప్పక తప్పదు.
గత ఏడాది కర్నూలు ఎయిర్ పోర్టు పనులు వేగంగా పూర్తి చేయాలని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేయగా.. అందుకు తగ్గట్లే త్వరితగతిన పనులు పూర్తి చేసి విమాన సర్వీసుల్ని అందుబాటులోకి తెచ్చారు. తాజాగా కేంద్రం మరో అడుగు ముందుకేసి ప్రయాణ అనుమతుల్నిజారీ చేయటంతో.. కర్నూలు జిల్లా ప్రజలు తమ జిల్లా కేంద్రం నుంచి పలు ప్రాంతాలకు విమానాల్లో వెళ్లే అవకాశం కలుగుతుందని చెప్పొచ్చు.
దీంతో.. ఏపీలో ఎయిర్ పోర్టుల సంఖ్య మరింత పెరిగింది. ఇప్పటికే రేణిగుంట..కడప.. గన్నవరం.. రాజమండ్రి.. కాకినాడ.. విశాఖపట్నంలో ఎయిర్ పోర్టులు ఉన్నాయి. తాజాగా కర్నూలు కూడా జాబితాలోకి రానుండటంతో రాష్ట్రంలో మొత్తం ఏడు ఎయిర్ పోర్టులు కానున్నాయి. ఇటీవలే ఢిల్లీ నుంచి వచ్చిన డీజీసీఏ అధికారుల టీం కర్నూలు వచ్చి.. ఎయిర్ పోర్టులోని మౌలిక వసతులు.. ఇతరత్రా అంశాల్ని పరిశీలించారు. సో.. విమానాల రాకపోకలు మరికొద్ది నెలల్లోనే కర్నూలు జిల్లా ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. ఏపీ ప్రజలకు ఇంతకు మించిన స్వీట్ న్యూస్ ఏముంటుంది చెప్పండి?