సెకండ్ వేవ్ వేళ..మాస్కుల వినియోగంపై సుప్రీం సీరియస్..ఏం చెప్పిందంటే?
కరోనా సెకండ్ వేవ్ ఇప్పటికే మొదలు కావటం తెలిసిందే. యూరప్.. అమెరికాలతో పాటు మరిన్ని దేశాలు కరోనా సెకండ్ వేవ్ కు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. దేశంలోనూ కొన్ని రాష్ట్రాల్లో సెకండ్ వేవ్ నడుస్తోంది. దీంతో.. మొన్నటివరకు తగ్గుముఖం పట్టిన కేసులు.. ఇప్పుడు మరోసారి పుంజుకుంటున్నాయి. అయితే.. సెకండ్ వేవ్ కొన్ని రాష్ట్రాల్లోనే ఎక్కువగా ఉండటం.. ఆ రాష్ట్రాల పుణ్యమా అని పక్కనున్న రాష్ట్రాలు ప్రభావితం అవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 43వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశవ్యాప్తంగా మొత్తం 93.09లక్షల కేసులు నమోదైనట్లు ఉంది. ఇక శుక్రవారం ఒక్కరోజులో 492 మంది కరోనా కారణంగా మరణించగా.. ఇప్పటివరకు ఈ మహమ్మారి 1.35లక్షల మంది ప్రాణాల్ని తీసింది.
దేశంలో అంతకంతకూ పెరుగుతున్నకరోనా కేసులపై తాజాగా సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేస్తూ సీరియస్ అయ్యింది. దేశవ్యాప్తంగా మొత్తం కేసుల్లో పది రాష్ట్రాల్లోనే 77 శాతం ఉన్నట్లుగా కేంద్రం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. మహారాష్ట్ర.. కేరళ.. ఢిల్లీ..పశ్చిమబెంగాల్.. కర్ణాటక.. రాజస్థాన్.. ఉత్తరప్రదేశ్.. ఛత్తీస్ గఢ్.. ఆంధ్రపదేశ్ రాష్ట్రాల్లో అత్యధిక కేసులు నమోదైనట్లుగా పేర్కొన్నారు.
ఈ సందర్భంగా కరోనా నివారకు కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆయా రాష్ట్రాల్లో కోవిడ్ నిబంధనలు అమలు కాకపోతే.. వాటిని అమలు అయ్యేలా చూడాల్సిన బాధ్యత కేంద్రానిదేనని స్పష్టం చేసింది. సెకండ్ వేవ్ ప్రమాదకరంగా ఉండబోతోందని.. కొవిడ్ మార్గదర్శకాల్ని కఠినంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని చెప్పింది. దేశ ప్రజల్లో 60 శాతం మంది మాస్కులు పెట్టుకోవటం లేదని.. 30 శాతం మంది గడ్డం కిందకు మాస్కుల్ని వేలాడదీస్తున్నట్లుగా పేర్కొన్నారు. ‘‘గడ్డు పరిస్థితులు ఎదురు కాబోతున్నాయి. ఆంక్షల్ని కఠినతరం చేయాల్సిందే’’ అని స్పష్టం చేశారు.