కార్తీకి భారీ ఎదురుదెబ్బ త‌గిలిందిగా!

Update: 2018-03-06 10:26 GMT
టైం బాబు టైం అని ఊరికే అన‌లేదేమో. ఒక‌ప్పుడు స‌లాం కొట్టిన అధికారులే.. ఈ రోజు క‌ట‌క‌టాల వెన‌క్కి పంపిన ప‌రిస్థితి. ఒక‌ప్పుడు రాజ‌వైభోగాలు అనుభ‌వించి.. ప‌వ‌ర్ ను అర‌చేతిలో పెట్టుకు తిరిగిన వ్య‌క్తి ఈ రోజు క‌నీసం బెయిల్ కూడా పొంద‌లేని దుస్థితి చూస్తే.. ఎలాంటోడు ఎలాంటి ప‌రిస్థితిలోకి వెళ్లిపోయాడ‌న్న భావ‌న క‌ల‌గ‌టం ఖాయం. ఇదంతా మ‌రెవ‌రి గురించో కాదు.. మాజీ కేంద్ర ఆర్థిక‌మంత్రి.. సీనియ‌ర్ కాంగ్రెస్ నేత చిదంబ‌రం తంబి కుమారుడు కార్తీ చిదంబ‌రం లేటెస్ట్ ప‌రిస్థితి.

ఐఎన్ఎక్స్ మీడియా ముడుపుల కేసులో బుక్ అయిన కార్తీ.. ఈ కేసులో ముంద‌స్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. ఈ పిటిష‌న్ ను ప‌రిశీలించిన సుప్రీంకోర్టు ఈ బెయిల్ పిటిష‌న్ ను తోసిపుచ్చింది. దీంతో.. ముంద‌స్తు బెయిల్ పై పెట్టుకున్న ఆశ‌ల‌న్నీ వ‌మ్ము అయిన‌ట్లుగా చెప్పాలి.

కార్తీపై న‌మోదైన మ‌నీలాండ‌రింగ్ కేసుపై ఈడీకి నోటీసులు జారీ చేసింది. ఈ ఉదంతంలో ముంద‌స్తు అరెస్ట్ లు జ‌ర‌గ‌కుండా చూసేందుకు ఎలాంటి ర‌క్ష‌న ఇవ్వ‌లేమ‌ని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. అనంత‌రం ఈ కేసుపై విచార‌ణ మార్చి 9కి వాయిదా వేసింది.ఇదిలా ఉంటే.. ఈడీ జారీ చేసిన స‌మ‌న్ల‌ను కొట్టివేయాలంటూ సుప్రీంను ఆశ్ర‌యించిన కార్తీకి భారీ ఎదురుదెబ్బ త‌గిలిన‌ట్లుగా అంచ‌నా వేస్తున్నారు. మ‌రోవైపు ఐఎన్ఎక్స్ మీడియాలో విదేశీ పెట్టుబ‌డుల‌కు ప‌చ్చ‌జెండా ఊపేందుకు వీలుగా త‌న తండ్రి అధికారాన్ని వినియోగించుకున్నార‌న్న ఆరోప‌ణ ఉంది. దీనిపై కార్తీకి ప్ర‌స్తుతం సీబీఐ ప్ర‌శ్నిస్తోంది. ఇలా.. ఒక‌టి త‌ర్వాత ఒక‌టి చొప్పున క్యూ క‌ట్టిన కేసుల‌తో చిదంబ‌రం ఫ్యామిలీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఇదంతా రాజ‌కీయ క‌క్ష‌తోనే త‌మ‌ను వేధిస్తున్న‌ట్లుగా కార్తీ చిదంబ‌రం అండ్ కో ఆరోపిస్తోంది. చేసుకున్నోళ్ల‌కు చేసుకున్నంత అని ఊరికే అన‌లేద‌న్న నానుడి కార్తీ ఎపిసోడ్‌ను చూస్తే  ఇట్టే గుర్తుకు రావ‌టం ఖాయం
Tags:    

Similar News