బీజేపీ వ‌ర్సెస్ బీఆర్ ఎస్‌.. క‌రీంన‌గ‌ర్ బంద్‌!

తెలంగాణ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ ఎస్‌, మ‌రో ప్ర‌తిప‌క్షం బీజేపీకి మ‌ధ్య నెల‌కొన్న రాజ‌కీయ వివాదంలో క‌రీంన‌గ‌ర్‌.. న‌లిగిపోతోంది.;

Update: 2026-05-09 09:50 GMT

తెలంగాణ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ ఎస్‌, మ‌రో ప్ర‌తిప‌క్షం బీజేపీకి మ‌ధ్య నెల‌కొన్న రాజ‌కీయ వివాదంలో క‌రీంన‌గ‌ర్‌.. న‌లిగిపోతోంది. తాజాగా శ‌నివారం బీఆర్ ఎస్ పార్టీ.. క‌రీంన‌గ‌ర్ బంద్‌కు పిలుపునిచ్చింది. త‌మ పార్టీకి చెందిన ఎమ్మెల్యే క్యాంపు కార్యాల‌యంపై బీజేపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు దాడి చేయ‌డాన్ని బీఆర్ ఎస్ తీవ్రంగా ప‌రిగ‌ణిస్తోంది. ఈ నేప‌థ్యంలోనే క‌రీంన‌గ‌ర్ బంద్‌కు పిలుపునిచ్చింది.

అయితే.. ఈ విష‌యంలో అధికార పార్టీ కాంగ్రెస్ మౌనంగా ఉంది. త‌మ‌కు ఈ వివాదంతో సంబంధం లేద ని తేల్చి చెప్పింది. మ‌రోవైపు.. పోలీసులు.. క‌రీంన‌గ‌ర్‌లోని ప్ర‌ధాన ప్రాంతాల‌ను త‌మ అదుపులోకి తీసుకు న్నారు. అధికారికంగానే 144 సెక్ష‌న్‌ను విధించారు. ర‌హ‌దారుల‌పై భారీ సంఖ్య‌లో పోలీసుల‌ను మోహ‌రిం చారు. ఇక‌, బీఆర్ ఎస్ నాయ‌కుడు, ఎమ్మెల్యే గంగుల క‌మ‌లాక‌ర్‌ను పోలీసులు గృహ నిర్బంధం చేశారు.

బీఆర్ ఎస్ పార్టీ ఇత‌ర నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌ను ఎక్క‌డిక‌క్క‌డ అరెస్టు చేసి.. పోలీసు స్టేష‌న్ల‌కు త‌ర‌లించా రు. ప్ర‌స్తుతం క‌రీంన‌గ‌ర్‌లో ప‌రిస్థితి ఒక‌ర‌కంగా ఉద్రిక్తంగానే ఉంది. దీనిపై బీజేపీ నాయ‌కులు స్పందిస్తూ.. క‌రీంన‌గ‌ర్‌లో రాజ‌కీయాలు చేసేందుకు బీఆర్ ఎస్‌కు ఏం హ‌క్కు ఉంటుంద‌ని ప్ర‌శ్నించింది. కాలానే చిల్ల ర గొడ‌వ‌ల‌ను రాద్ధాంతం చేసి.. క‌రీంన‌గ‌ర్‌లో అల్ల‌ర్లు సృష్టించే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని నాయ‌కులు విమ‌ర్శించారు.

మ‌రోవైపై.. త‌మ పార్టీ నాయకుడిపైనా..క్యాంపు కార్యాల‌యంపైనా దాడి చేయ‌డాన్ని బీఆర్ ఎస్ తీవ్రంగా ప‌రిగణిస్తోంది. బీజేపీ నాయ‌కులు క్షమాప‌ణ‌లు చెప్పాల‌ని బీఆర్ ఎస్ డిమాండ్ చేస్తోంది. ఇలా ఒక‌రిపై ఒక‌రు మాట‌లు తూటాలు పోల్చుకుంటున్న నేప‌థ్యంలో పోలీసులు 144 సెక్ష‌న్ విధించి.. భ‌ద్ర‌త‌ను క‌ట్టుదిట్టం చేయ‌డం గ‌మ‌నార్హం.

Tags:    

Similar News