కథువా దారుణంపై సుప్రీం రియాక్షన్ ఇది!
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించటంతో పాటు.. ఇంత దారుణాన్ని తామెప్పుడూ వినలేదన్న మాట అందరి నోటా వినిపిస్తోంది. ఇక.. సెలబ్రిటీలు అయితే.. ఈ అంశాన్ని తీవ్రంగా తప్పు పట్టటంతో పాటు.. ఘాటు విమర్శలు చేశారు. కొందరైతే.. ఇదెక్కడి ఘోరమంటూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.
ఇంతటి సంచలాన్ని సృష్టించిన కథువా మైనర్ బాలిక అత్యాచార కేసును చేపట్టేందుకు సర్వోన్నత న్యాయస్థానం సంసిద్ధత వ్యక్తం చేసింది. ఎనిమిదేళ్ల మైనర్ బాలికను నాలుగు రోజులపాటు వరుసగా సామూహిక అత్యాచారం చేసి.. ఆ తర్వాత దారుణంగా కొట్టి చంపి పడేసిన వైనంపై తమకు వాస్తవాల్ని లిఖితపూర్వకంగా అందిస్తే కేసును పరిశీలించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు దేశ అత్యున్నత న్యాయస్థానం వెల్లడించింది.
కథువా ఉదంతాన్ని సుమోటోగా స్వీకరించాలని సుప్రీంకోర్టు న్యాయవాదుల బృందం సర్వోన్నత న్యాయస్థానానికి విన్నవించింది. దీనిపై స్పందించిన సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా.. జస్టిస్ ఏఎం కన్విల్కార్.. జస్టిస్ డీవై చంద్రచూడ్ లతో కూడిన సుప్రీం బెంచ్ ఈ అంశాల్ని విచారణకు చేపట్టాలంటూ ఢిల్లీ న్యాయవాదులు కోరారు. దీనిపై అన్ని వాస్తవాల్ని తమకు లిఖిత పూర్వకంగా ఇస్తే విచారణకు సిద్ధమని కోర్టు స్పష్టం చేసింది.