యాసిడ్ దాడి సర్జరీల పై సుప్రీం తీర్పు!

Update: 2015-04-11 05:16 GMT
దేశంలో పెరిగిపోతున్న యాసిడ్ దాడుల విషయంలో సుప్రీం కోర్టు సంచలన వ్యాఖ్య చేసింది! యాసిడ్ దాడికి పాల్పడిన వారికి శిక్షకు సంబందించి చట్టాలు ఉన్నాకి కానీ... దాడిలో గాయపడిన వారి గురించి, వారికి తగిన వైద్య సహాయం అదించడానికి సరైన చట్టాలు లేకపోవడంతో సుప్రీం వ్యాఖ్య చేసిందని పలువురు అభిప్రాయపడుతున్నారు! దీని ప్రకారం యాసిడ్ దాడిలో గాయపడిన వారిని తక్షణం ఆసుపత్రిలో చేర్చి ఉచితంగా వైద్యం అందించాలని సుప్రీం
పేర్కొంది. అందుకోసం ప్రైవేట్ ఆసుపత్రులతో కలిసి పనిచేయాలని సుప్రీం కోర్టు రాష్ట్రాలను ఆదేశించింది. దాడిలో గాయపడి ఆసుపత్రికి వచ్చిన వారికి యాసిడ్ బాధితులు అంటూ సర్టిపికేట్ కూడా ఇవ్వాలని ప్రైవేట్ ఆసుపత్రులను కోర్టు ఆదేశించింది. సర్టిపికేట్ ద్వారా యాసిడ్ దాడి బాధితులకు కావాల్సిన చికిత్సను, వైద్యానికి అయ్యే మందులను, అవసరమైన మేర ఖరీదైన సర్జరీలను ఉచితంగానే అందించాలని  స్పష్టం చేసింది. యాసిడ్
దాడిలో గాయపడి ఖరీదైన సర్జరీలు చేసుకొనే స్తోమత లేని అనేక మందికి తీర్పు వల్ల మేలు కలుగుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇకపై యాసిడ్ అమ్మకాలపై నియంత్రణ ఉంచాలని సందర్భంలో రాష్ట్రాలకు స్పష్టం చేసింది సుప్రీం కోర్టు! అదే సమయంలో యాసిడ్ దాడిలో గాయపడిన భాదితులకు రూ. 3 లక్షల వరకు నష్ట పరిహారం ఇవ్వాలని రాష్ట్రాలకు ఆదేశించింది
Tags:    

Similar News