మోహన్ బాబు కాలేజ్ ఎదుట విద్యార్థుల ధర్నా

Update: 2021-04-27 09:30 GMT
సినీ నటుడు మోహన్ బాబుకు చెందిన శ్రీవిద్యానికేతన్ ఇంజనీరింగ్ కళాశాల ఎదుట విద్యార్థులు ధర్నా చేశారు. ఈ మేరకు వారు ఒక వీడియోను రిలీజ్ చేశారు.

తమ కాలేజీలో ఒక లెక్చరర్ కరోనా వల్ల చనిపోయాడని.. 150 మంది విద్యార్థులకు కరోనా వచ్చిందని.. అయినా కళాశాలలో తరగతులు నిర్వహిస్తున్నారని ఆ వీడియోలో ఇద్దరు విద్యార్థులు ఆరోపించారు.

కరోనా వచ్చినా కూడా వారిని పరీక్షలకు హాజరు కావాలని కళాశాల యాజమాన్యం చెప్పుతోందని విద్యార్థులు ఆరోపించారు.

ఇప్పటికే మెయిన్ హాస్టల్ లో 150 కేసులు పెరిగాయని.. ఎవరూ పట్టించుకోకపోవడంతో విద్యార్థులు ర్యాలీ తీస్తున్నారని వారు తెలిపారు.ఇంతమంది ఎండలో కూర్చొని నిరసన తెలుపుతున్నా తరగతులు, క్లాసులు నిర్వహిస్తున్నారని ఆరోపించారు.

కరోనా సోకినా.. రోగం వచ్చినా  పరీక్షలకు రమ్మంటున్నారని విద్యార్థులు ఆరోపించారు. దయచేసి మాకు సాయం చేయండని.. మమ్మల్ని కాపాడాలని విద్యార్థులు వీడియోలో కోరారు.

విద్యార్థులు కోరిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. Full ViewFull View
Tags:    

Similar News