బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ కింద పొంచి ఉన్న ముప్పు!
హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్ చిక్కులు తొలగించేందుకు ఫ్లైఓవర్లు కట్టిన తెలంగాణ సర్కార్ వాటి రక్షణ, భద్రత విషయంలో మాత్రం పట్టించుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఘనంగా ప్రారంభించిన ‘బయోడైవర్సిటీ’ ఫ్లైఓవర్ పై వరుస ప్రమాదాలు కలవరపెట్టాయి. ఇప్పటికే ఓ కారు పల్టీలు కొట్టి ఒక మహిళ మరణానికి దారితీసింది. ఫ్లైఓవర్ సరిగా సాంకేతికంగా కట్టలేదని.. అందుకే ప్రమాదాలు జరుగుతున్నాయని ఆరోపణలు వచ్చాయి.
ఈ సంఘటన తర్వాత ఫ్లైఓవర్ ను దాదాపు 2 నెలలు మూసివేశారు. ఆ ఫ్లైఓవర్ పై భద్రతా చర్యలు చేపట్టారు. ఆ తర్వాత ప్రయాణించేందుకు తెరిచారు.
అయితే తాజాగా బయోడైవర్సిటీ కింద మరో ప్రమాదం కలవరపెడుతోంది. ఈ ఫ్లైఓవర్ కింద ఉన్న ఒక ఇనుప కడ్డీ దాని కింద గుండా పోయే రహదారిపై పడింది. అదృష్టవశాత్తూ ఆ సమయంలో కింద ఎవరూ లేరు.ఒకవేళ బైక్, కారు దాని కింద పోతున్నప్పుడు పడితే వారి ప్రాణాలు పోయేవి.
ఈ ఘటనతో మరోసారి బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ నాణ్యత, రూపకల్పనపై ఆందోళనలు పెరిగిపోయాయి. ఒక వ్యక్తి ఈ ఇనుప కడ్డీ పడిపోయిన చిత్రాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసి అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. దీనిని చూసిన నెటిజన్లు షాక్ అయ్యారు. ఫ్లైఓవర్ నాణ్యతపై మరోసారి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.