సర్వేలు : రేవంత్‌రెడ్డి అవినీతి చేశారంటే.. జనం నమ్ముతున్నారా?
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు పూర్తయ్యాయి. 2023 నవంబరు-డిసెంబరు మధ్య ఏర్పడిన ఈ ప్రభుత్వం.. సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో ముందుకు సాగుతోంది.;
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు పూర్తయ్యాయి. 2023 నవంబరు-డిసెంబరు మధ్య ఏర్పడిన ఈ ప్రభుత్వం.. సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో ముందుకు సాగుతోంది. అయితే.. తరచు గా ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్ పార్టీ అగ్రనేతలు.. హరీష్‌రావు, కేటీఆర్‌లు సీఎం రేవంత్ రెడ్డి సహా మం త్రులు అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు. తాజాగా కూడా కేటీఆర్ గత రెండు మూడు రోజులుగా సీఎంను కార్నర్ చేస్తూ.. `దోచుకుంటున్నారు.. దాచుకుంటున్నారు` అని వ్యాఖ్యానిస్తున్నారు.
ఈ వ్యవహారంపై తెలంగాణ సమాజం ఏమనుకుంటోంది? నిజమేనని నమ్ముతోందా? రేవంత్ రెడ్డి ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందనే భావిస్తోందా? అనే కీలక విషయాలపై తాజాగా ఆన్ లైన్ ఛానెళ్లు క్షేత్ర స్థాయిలో సర్వేలు చేశాయి. నేరుగా అవినీతిని ప్రస్తావించకపోయినా.. సర్కారు పనితీరును ప్రశ్నించింది. మెజారిటీ ప్రజల అభిప్రాయాలను పలు ఆన్‌లైన్ మీడియా చానెళ్లు సేకరించాయి. దీనిలో అవినీతి విషయంపై ప్రజల్లో ఇంకా నిశ్చితాభిప్రాయం అయితే ఏర్పడినట్టు కనిపించలేదు.
కొందరు 'ఏమో తెలియద'ని సమాధానం చెప్పగా.. మరికొందరు.. అంత అవకాశం లేదని.. ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లకాలమే అయిందని.. చెప్పుకొచ్చారు. అంతేకాదు.. మరికొందరు.. ''రేవంత్‌పై నమ్మకం ఉంది. ఆయన తింటారని మేం అనుకోవడం లేదు. ఇవన్నీ రాజకీయ విమర్శలే.. వీటిని పట్టించుకోవా ల్సిన అవసరం లేద''ని బదులిచ్చారు. ఇక, వీటిపై ప్రముఖ విశ్లేషకులు కూడా స్పందించారు. విధాన పరమైన అంశాల్లో కొంత అసంతృప్తి ఉన్నదని చెబుతున్నారు. కానీ.. అవినీతి, అక్రమాల విషయంలో కేవలం రాజకీయ విమర్శలు మాత్రమేనని బదులిచ్చారు.
ప్రధానంగా.. బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న విమర్శల విషయంలో ప్రజల స్పందన నామమాత్రమేనని తెలిసిపోతోంది. ఎక్కువ మంది బీఆర్ ఎస్ హయాంలో జరిగిన వ్యవహారాలను ఇంకా మరిచిపోలేదు. ఇప్పటి కీ రైతులు.. తమ ఇబ్బందులు చెబుతున్నారు. దళిత సామాజిక వర్గాలు కూడా.. బీఆర్ ఎస్ హయాంలో తమపట్ల వివక్ష కొనసాగిందని అంటున్నారు. నిరుద్యోగం, ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు సరిగా ఇవ్వకపోవడం వంటివాటిని కొందరు ప్రస్తావించారు. సో.. బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న అవినీతి ఆరోపణలను ప్రస్తుత పరిస్థితిలో మెజారిటీ ప్రజలుఎవరూ విశ్వసించడం లేదని స్పష్టమైంది.