పవన్ అయ్యింది.. కేటీఆర్ ది మొదలైంది

Update: 2017-02-19 06:03 GMT
ప్రఖ్యాత విశ్వవిద్యాలయాల్లో తెలుగోళ్ల స్పీచ్ లకు ఆహ్వానాల మీద ఆహ్వానాలు వస్తున్నాయి. మొన్నటికి మొన్న జనసేన అధినేత ప్రఖ్యాత హార్వర్డ్ విశ్వవిద్యాయలంలో స్పీచ్ ఇచ్చేందుకు ఆహ్వానం రావటం తెలిసిందే. తనకొచ్చిన ఆహ్వానం నేపథ్యంలో యూఎస్ వెళ్లిన పవన్.. తన స్పీచ్ తో అందరిదృష్టిని ఆకర్షించటమే కాదు.. తన మాటలతో ఆకట్టుకున్నారు.

మోస్ట్ బ్యాలెన్స్డ్ పొలిటీషియన్ గా ఇమేజ్ ను ఆయన సొంతం చేసుకున్నారు. రాజకీయాలతో పాటు.. విషయాల పట్ల తనకున్న అవగాహనను.. తన దృక్ఫదాన్ని చాటి చెప్పిన తీరుతో.. పవన్ కు కొత్త అభిమానులు చాలామంది తయారయ్యారు. ఇప్పుడా ముచ్చటను పక్కన పెడితే.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కమ్ రాష్ట్రమంత్రి కేటీఆర్ కు ఈ తరహా ఆహ్వానమే ఒకటి తాజాగా అందింది.

అమెరికాలోని ప్రఖ్యాత వర్సిటీల్లో ఒకటైన స్టాన్ ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో మే18 - 19 తేదీల్లో జరిగే వార్షిక సదస్సులో పాల్గొనాలంటూ ఆహ్వానం అందింది. ఉపాది.. ఉద్యోగాల కల్పన.. పరిశ్రమల అంశంపై కీలక ఉపన్యాసం ఇవ్వాలంటూ వర్సిటీ కోరింది. ఈ సదస్సు ప్రత్యేకత ఏమిటంటే.. వివిధ దేశాలకు చెందిన ప్రతినిధులతోపాటు.. స్టాన్ ఫోర్డ్ అధ్యాపకులు.. విద్యార్థులు హాజరుకానున్నారు. గడిచిన రెండున్నరేళ్ల వ్యవధిలో తెలంగాణ రాష్ట్రం సాధించిన ప్రగతి.. సాంకేతికత.. నైపుణ్యశిక్షణ.. పరిశ్రమలకు ప్రోత్సాహం గురించి మాట్లాడాల్సిందిగా కోరారు. మరి.. తనకు లభించిన అవకాశాన్ని కేటీఆర్ మరెంతలా సద్వినియోగం చేసుకుంటారో..?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News