కరోనా కాటు: ఎలాంటోడు ఎలా అయ్యాడిలా?

Update: 2021-06-20 06:01 GMT
కరోనా ఎందరినో కబళించింది. సెకండ్ వేవ్ వేళ కనీసం బెడ్స్ లేక చాలా మంది అసువులు బాసారు. ఆక్సిజన్ కొరతతో అల్లాడారు. తెలంగాణ ప్రముఖ బాడీ బిల్డర్ సుశీల్ కుమార్ (32) కూడా కరోనా బారిన పడి చావు అంచుల వరకు వెళ్లాడు. ఆస్పత్రిలో బెడ్ దొరక్కపోవడంతో కుటుంబం సోనూ సూద్ ను ఆశ్రయించింది. అతడి చొరవతో యశోద ఆస్పత్రిలో చేరాడు. దాదాపు 80శాతం  ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ కు గురైన సుశీల్ ఎట్టకేలకు బతికి బయటపడ్డాడు.

యశోద ఆస్పత్రి వైద్యుల కృషి, సోనూసూద్ చొరవతో తెలంగాణ బాడీ బిల్డర్ సుశీల్ కుమార్ (32) క్షేమంగా బయటపడ్డాడు. బ్యాక్టీరియల్, ఫంగల్ ఇన్ఫెక్షన్లతోపాటు సిటీ స్కోర్ 25/25తో 20 రోజుల పాటు వెంటిలేటర్ ప ఉన్న బాడీ బిల్డర్ కు అరుదైన చికిత్స అందించి యశోద వైద్యులు సాధారణ స్థితికి తీసుకొచ్చారు.

కరోనా బారిన పడిన సుశీల్ ఆరోగ్యం క్షీణించడంతో మలక్ పేట యశోధ ఆస్పత్రికి వచ్చారని డైరెక్టర్ పవన్ గోరుకంటి తెలిపారు. సుధీర్ఘ చికిత్స తర్వాత ఆయన సాధారణ స్థితికి వచ్చారని పల్మనాలజిస్ట్ డాక్టర్ విశ్వేశ్వరన్ తెలిపారు.

క్రీడా నేపథ్యం తెలుసుకున్న  సినీ నటుడు సోనూ సూద్ యశోద ఆస్పత్రికి తరలించడంలో ప్రత్యేక చొరవ తీసుకున్నాడు. ఆయన సహాయం వల్లే సుశీల్ కు మెరుగైన వైద్యం అందిందని యశోద డాక్టర్ తెలిపాడు.

80శాతం లంగ్ ఇన్ ఫెక్షన్ కు గురైన సుశీల్ చికిత్స పొందుతూ తాజాగా డిశ్చార్జి అయ్యాడు. కరోనాకు ముందు సుశీల్ బరువు 100 కిలోలు ఉండగా.. ప్రస్తుతం 72 కేజీలకు పడిపోయింది. ఏప్రిల్ లో అతడికి కరోనా సోకింది.
Tags:    

Similar News