• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  మహారాష్ట్ర బీజేపీ...

మహారాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యేను స్టార్ హీరోయిన్ అంత మాటన్నదా?

By - Tupaki Desk
Update: 2021-12-30 13:30 GMT
అందం.. అభినయం.. చదువు.. కుటుంబ బలం.. వీటన్నటికీ తోడు స్టార్ డమ్.. అన్నీ ఉన్న వ్యక్తి ఆమె. బ్యూటీ ఐకాన్ గానే కాదు..అభిప్రాయాలను నిర్మొహమాటంగా చెప్పే బలమైన వ్యక్తిత్వం ఉన్న మహిళగానూ సోనమ్ కు పేరు. హీరోయిన్ గా స్టార్ డమ్ ను చూసిన ఆమె.. 2012-16 మధ్య బాలీవుడ్ లో తనదైన ముద్ర వేశారు. నేషనల్ ఫిలిం అవార్డు, ఫిలింఫేర్ అవార్డులను గెలుచుకున్నారు.

ఆదాయం- పాపులారిటీ రీత్యా ఫోర్బ్స్ ఇండియా వందమంది సెలబ్రిటీల జాబితాలో నిలిచారు. 36 ఏళ్ల సోనమ్.. బాలీవుడ్ లో మంచి అవకాశాలు వస్తుండగానే 2018లో ఆనంద్ ఆహూజాను వివాహమాడారు. అయితే, సోషల్ మీడియాలో సోనమ్ చురుగ్గా ఉంటారు. ఆ క్రమంలో తనఅభిప్రాయాలకు విమర్శలు ఎదురైనా వెరవరు. ఎన్ని ట్రోల్స్ ఎదురైనా ఆమె వెనక్కి మాత్రం తగ్గరు. అసలే యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ లండన్ చదువాయె ఆమెది. అందుకే అంత బలమైన వ్యక్తిత్వం ఏర్పడిందంటారు.

అజ్ఞాని అంటూ ఎమ్మెల్యేపై ఫైర్

తాజాగా సోనమ్ కపూర్.. ‘‘అజ్ఞాని’’అంటూ ఓ బీజేపీ ఎమ్మెల్యేపై సంచలన వ్యాఖ్యలు చేశారు. లెస్బియన్, గే, బై సెక్సువల్, ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ (ఎల్‌జీబీటీక్యూ) వ్యతిరేకంగా బీజేపీ ఎమ్మెల్యే సుధీర్ ముంగంటివార్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మహారాష్ట్ర ప్రభుత్వం ఎల్‌జీబీటీక్యూ కమ్యూనిటీ వారికి సమాన అవకాశాలను కల్పించడాన్ని వ్యతిరేకిస్తూ సుధీర్ ముంగంటివార్ చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.

ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వివాదం మొదలైంది. మహారాష్ట్ర పబ్లిక్ యూనివర్శిటీ చట్టం, 2016 ప్రకారం ప్రతిపాదిత సవరణ బిల్లుకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు. కాగా, తన స్టైల్ తో బాలీవుడ్ లో బ్యూటీ ఐకాన్ గా నిలిచి.. అభిప్రాయాలను కుండ బద్దలు కొట్టినట్టుగా చెప్పే సోనమ్ వీటిపై అంతే తీవ్రంగా స్పందించారు. ఎల్‌జీబీటీక్యూ కమ్యూనిటీకి వ్యతిరేకంగా సుధీర్ ముంగంటివార్ చేసిన వ్యాఖ్యల వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్స్టో రీలో షేర్ చేస్తూ “అజ్ఞాని నిరక్షరాస్యులు, ద్వేషపూరితం” అంటూ సోనమ్ కౌంటర్ వేశారు. సోనమ్ మాత్రమే కాదు సన్నీ లియోన్ వంటి బాలీవుడ్ ప్రముఖులు కూడా ముంగంటివార్ వ్యాఖ్యలను తప్పుబడుతూ మండిపడుతున్నారు.


Tags:    
  • Sonam Kapoor 
  • BJP MLA 
  • Sonam Kapoor images 
  • Sonam Kapoor pics 
  • Sonam Kapoor new images 
  • Sudhir Mungantiwar 

Similar News

డేటింగ్ నుంచి వివాహం వరకు.. నేటి యువత మైండ్‌సెట్‌పై ప్రభుత్వం ఫోకస్!

2026-11-05 08:08 GMT

క్రెడిట్ ఎంపీ భరత్ కేనా ?

2026-11-05 08:06 GMT

ఏబీవీ మీడియా పులేనా.... గ్రౌండ్‌లో రాజకీయ బలం లేదా ?

2026-11-05 07:54 GMT

కాంగ్రెస్‌కు షర్మిల అవసరముందా...జగన్‌ను టార్గెట్ చేయడమే రాజకీయమా ?

2026-11-05 07:29 GMT

స్థానిక ఎన్నికల్లో జగన్ గెలిచి 2024లో ఓడారు....కూటమికి అదే పరిస్థితి ఎదురవుతుందా ?

2026-11-05 07:15 GMT

ఏం చూడకుండానే ఏఐ ద్వారా ఉత్తర్వులు.. అధికారులకు హైకోర్టు మొట్టికాయలు..

2026-11-05 07:14 GMT

అమెరికా ఎన్నికల ఎఫెక్ట్.. భారత స్టాక్ మార్కెట్లలో భారీ ర్యాలీ.. ఇన్వెస్టర్లకు రూ.6 లక్షల కోట్ల లాభం!

2026-11-05 06:54 GMT

హైడ్రా రంగనాథ్ నెక్ట్స్ టార్గెట్ ఇదే..

2026-11-05 06:52 GMT

పాతపగలన్నీ మాని ట్రంప్ కు వేల కోట్లు ఇచ్చినా.. పాపం ఎలన్ మస్క్ పరిస్థితి ఇదీ

2026-11-05 06:37 GMT

ఇక.. 100 ప‌ర్సంట్ దూకుడే.. !

2026-11-05 06:27 GMT

అసెంబ్లీ కంటే ఘోర‌మా.. జ‌గ‌న్‌.. నెక్ట్స్ ఏంటి.. ?

2026-11-05 06:25 GMT

వైసీపీలో అంత‌ర్గ‌త పోరు.. నెల్లూరు మునక‌.. !

2026-11-05 06:23 GMT

Copyright @2026

Powered by Blink CMS