• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  చంద్రబాబు అవినీతి పై...

చంద్రబాబు అవినీతి పై రెఫరెండం నిర్వహించాలట!

By - Tupaki Desk
Update: 2020-12-20 10:30 GMT
చంద్రబాబునాయుడు అవినీతిపై రెఫరెండం నిర్వహించాలని బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు విచిత్రమైన డిమాండ్ చేశారు. గడచిన రెండు రోజుల నుండి చంద్రబాబు అండ్ కో రెఫరెండం విషయంలో అనేక డిమాండ్లు చేస్తన్న విషయం అందరికీ తెలిసిందే. జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన మూడు రాజధానులపై జనాభిప్రాయం కోసం రెఫరెండం నిర్వహించాలని చంద్రబాబు డిమాండ్ చేస్తున్నారు. నిజానికి చంద్రబాబు డిమాండే అసంబంద్దం. ఎందుకంటే మనదేశంలో ఏ విషయంలో కూడా రెఫరెండం అనే ప్రాక్టీసు లేదు.

అధికారంలో ఉన్న తనిష్టం వచ్చినట్లుగా నిర్ణయాలు తీసుకోవటమే మనదేశంలో ఉంది. అధికారపార్టీ తీసుకున్న నిర్ణయాలు, విధానాలు నచ్చకపోతే తర్వాత ఎన్నికల్లో జనాలు ఓడించటమే రెఫరెండంగా భావించాల్సుంటుంది. 2014లో చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసిన జనాలే 2019 ఎన్నికల్లో చిత్తుగా ఓడగొట్టారు. అంటే ఐదేళ్ళ చంద్రబాబు పాలనపై తమలో  పెరిగిపోయిన అసంతృప్తిని మొన్నటి ఎన్నికల్లో ఓట్లరూపంలో చూపించారు.

ఇక 2019 ఎన్నికల్లో 151 సీట్ల మెజారిటిని ఇవ్వటం ద్వారా జగన్ కు జనాలు మద్దతు పలికారు. జగన్ నిర్ణయాలు నచ్చకపోతే తర్వాత ఎన్నికల్లో ఓడిగొట్టేస్తారనటంలో సందేహం లేదు. అంతేకానీ మద్యలో ప్రభుత్వ నిర్ణయాలపై రెఫరెండం అనే పద్దతే లేదు. ఈ విషయం తెలిసి కూడా చంద్రబాబు పదే పదే ఇదే డిమాండ్లు చేస్తున్నారు. ఈ నేపధ్యంలోనే సోమువీర్రాజు హఠాత్తుగా చంద్రబాబు అవినీతిపై రెఫరెండం అని మొదలుపెట్టారు.

నిజానికి చంద్రబాబు అవినీతిపై కొత్తగా రెఫరెండం అవసరం లేదు. 2019 ఎన్నికల్లో జనాలిచ్చిన తీర్పే రెఫంరెండంగా అర్ధమైపోతోంది. అమరావతికి చంద్రబాబు చేసిన రూ. 7200 కోట్ల ఖర్చు, ఆ ముసుగులో జరిగిన అవినీతిపైనే రెఫరెండం నిర్వహించాలని వీర్రాజు డిమాండ్ చేస్తున్నారు. చంద్రబాబు అవినీతిపై రెఫరెండం నిర్వహించాలని డిమాండ్ చేసేబదులు సీబీఐ దర్యాప్తు చేయించాలని కేంద్రప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తే ఉపయోగం ఉంటుందేమో.
Tags:    
  • Chandra Babu Naidu 
  • TDP 
  • Political News 
  • Breaking News 
  • Tupaki News Tupaki Updates 
  • Tupaki 
  • Latest News 
  • Tupaki Media 

Similar News

డిసెంబరులో కీలక మార్పులు.. రాయలసీమ నుంచి కొత్త మంత్రులు

2026-11-02 13:55 GMT

ఒక నవ్వు.. ఎంబాపే కొంప మునిగింది.. చైనా నుంచి గట్టి షాక్ తగిలింది..

2026-11-02 13:54 GMT

'పదకొండు' ముహూర్తం బాగుంది.. వాళ్లు భుజాలు తడుముంటే నేనేం చేయాలి : విజయసాయిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

2026-11-02 13:50 GMT

విశాఖ యువకుల వ్యథ.. యువకులకు యుద్ధమే ఆహ్వానం పలికింది... బయటపడేదెలా?

2026-11-02 13:49 GMT

వరుస తుఫాన్లు.. చంద్రబాబుకు ఎన్నో విధాల మేలు

2026-11-02 12:30 GMT

ఇతరుల ఆనందమే కొలమానమా? జెన్ జెడ్ ను ఒత్తిడికి గురిచేస్తున్న సోషల్ మీడియా

2026-11-02 11:30 GMT

50 టీఎంసీల వరద..?! ‘మురసు’తో నిండనున్న పులిచింతల, నాగార్జునసాగర్

2026-11-02 11:04 GMT

దక్షిణాదికి బుల్లెట్ ట్రైన్.. బెంగళూరు నుంచి చెన్నైకి కేవలం 73 నిమిషాల్లోనే!

2026-11-02 10:24 GMT

తుఫాన్ల నెల నవంబర్.. అసలు కారణాలు ఏంటి?

2026-11-02 10:00 GMT

అమెరికా ఎన్నికలతో భారత్‌కు కొత్త పరీక్ష.. ట్రంప్ ఓడితే భారత్ కు లాభమా? నష్టమా?

2026-11-02 10:00 GMT

రాప్తాడు ఉన్మాదికి పోలీసు శిక్ష.. కుళ్లిపోయిన కుడికాలు, తొలగించే అవకాశం!

2026-11-02 09:58 GMT

తెలంగాణపై బీజేపీ ఫుల్ ఫోకస్.. అమిత్ షా ‘హైదరాబాద్ వ్యూహం’ గేమ్ ఛేంజర్ అవుతుందా?

2026-11-02 09:50 GMT

Copyright @2026

Powered by Blink CMS