వైఎస్ వివేకా హత్యకేసు..చిక్కుల్లో వర్ల రామయ్య

Update: 2019-10-16 05:01 GMT
అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య గొంతులో బేస్ మాత్రం తగ్గదు.. జగన్ ను, వైసీపీని తీవ్రంగా విమర్శించే ఆయన ఇప్పుడు నోరు జారి కష్టాల్లో పడ్డారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విషయంలో టీడీపీ నేత వర్ల రామయ్యకు ప్రత్యేక దర్యాప్తు బృందం నోటీసులు జారీ చేసింది.

వైఎస్ వివేకా హత్య కేసులో సిట్ దర్యాప్తు జరుగుతోంది. తాజాగా వర్ల రామయ్య ఈ హత్య కేసుపై సంచలన కామెంట్స్ చేశారు. ‘నిందుతులు జగన్ తెలుసు అని.. అసలు నేరస్థులను వదిలేసి డమ్మీలను తెరమీదకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారని’ వర్ల రామయ్య ఆరోపించారు. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు.

వైఎస్ వివేకా హత్య విషయంలో  వర్ల రామయ్య చేసిన కామెంట్స్ దుమారం రేపాయి. ఏకంగా డీజీపీ గౌతమ్ సవాంగ్ సైతం స్పందించారు.  ఇలా తప్పుడు ప్రచారం చేస్తే సహించబోమని స్పష్టం చేశారు. హత్యకేసును ప్రభావితం చేసేలా మాట్లాడవద్దని హెచ్చరించారు.

డీజీపీ హెచ్చరించగానే సిట్ రంగంలోకి దిగింది. వెంటనే వర్ల రామయ్యకు నోటీసులు జారీ చేయడం విశేషం. వర్ల రామయ్య తన వ్యాఖ్యలు - ఆరోపణలకు సంబంధించి ఏమైనా ఆధారాలు ఉంటే సిట్ ముందు ఉంచాలని..  సిట్ ముందు నేరుగా హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు. సాక్ష్యాలతో మాట్లాడకపోతే చర్యలు తప్పవంటూ నోటీసుల్లో హెచ్చరించింది. దీంతో వైఎస్ వివేకా హత్య కేసులో నోరుజారి ఇప్పుడు వర్ల రామయ్య తీవ్ర చిక్కుల్లో పడ్డారు.
Tags:    

Similar News