‘జైహింద్’’ అంటూ మనసు దోచేశాడు
తాజాగా భారత పౌరసత్వం పొందిన పాకిస్థాన్ గాయకుడు అద్నాన్ సమీ తాజాగా చేసిన వ్యాఖ్య భారతీయుల మనసుల్ని దోచుకుంది. తన గానంతో సంగీతప్రియుల్ని మంత్రముగ్థుల్ని చేసే ఆయన.. గత కొద్దికాలంగా భారత పౌరసత్వం కోసం ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. న్యూఇయర్ కానుకగా ఆయనకు భారత పౌరసత్వం ఇస్తూ అధికారిక ఆదేశాలు జారీ చేశారు.
భారతపౌరుడిగా ఎంజాయ్ చేస్తున్న అతడు భారత్ గురించి చేసిన వ్యాఖ్య పెద్ద ఎత్తున ఆకట్టుకుంటోంది. ‘‘భారత్ లో అసహనం లేదు. ఈ దేశంలో అసహనం ఉండి ఉంటే.. నేను పౌరసత్వం స్వీకరించేవాడిని కాదు. భారత్ తో నాకు 2001 నుంచి సంబంధం ఉంది. నేను ఎప్పుడూ అసహనాన్ని చవిచూడలేదు. గతంలో బాలీవుడ్ స్టార్లు అమీర్ ఖాన్.. షారూక్ ఖాన్లు అసహనం మీద వ్యాఖ్యలు చేసి ఉండొచ్చు. వారికి ఎదురైన అనుభవాల నేపథ్యంలో అలా వ్యాఖ్యలు చేసి ఉండొచ్చు. అవన్నీ వారి వ్యక్తిగతం. ఎవరి అభిప్రాయాలు వారు స్వేచ్ఛగా వెల్లడించే అవకాశం ఈ దేశంలో ఉంది.. జైహింద్’’ అంటూ వ్యాఖ్యానించి పలువురు మనసును దోచుకున్నాడు.