• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  కేటీఆర్ అలక బూనాడా..?...

కేటీఆర్ అలక బూనాడా..? కారణమేంటి..?

By - Tupaki Desk
Update: 2023-01-14 12:30 GMT
జాతీయ రాజకీయాలను శాసించేలా బీఆర్ఎస్ పార్టీని విస్తరిస్తామని ఆ పార్టీ నేత కేసీఆర్ ప్రకటిస్తున్నారు. మరోవైపు తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లో కీలకంగా మార్చేందుకు వ్యూహం పన్నుతున్నారు. ఇప్పటికే ఏపీలో కమిటీ వేసిన ఆయన మిగతా రాష్ట్రాల్లోనూ త్వరలో కేడర్ ను పెంచుకునేందుకు ప్రయత్నించే అవకాశం ఉంది. అయితే  కేసీఆర్ కు సొంత మనిషే బీఆర్ఎస్ పై అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో కారు పార్టీకి నెంబర్ 2 గా ఉన్న కేసీఆర్ కుమారుడు, మంత్రి కేటీఆర్ బీఆర్ఎస్ కార్యక్రమాల్లో కనిపించడం లేదు. బీఆర్ఎస్ కు సంబంధించి ఏ ప్రత్యేక ప్రొగ్రాం అనౌన్స్  చేసినా వివిధ కారణాలతో ఆ కార్యక్రమాలకు గైర్హాజరవుతున్నారు. తాజాగా ఖమ్మంలో నిర్వహించే సభకూ డుమ్మా కొట్టనున్నారు.  దీంతో  బీఆర్ఎష్ పై కేటీఆర్ఎస్ అలక బూనాడా..? అనే చర్చ సాగుతోంది.

టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ మారినప్పటి నుంచి కేటీఆర్ పలు కార్యక్రమాల్లో కనిపించలేదు. ఢిల్లీలో పార్టీ కార్యాలయం ప్రారంభం మొదలుకొని మొన్నటి ఏపీ నాయకులు పార్టీలో చేరిన సందర్భంగా ఆయన తప్పించుకున్నారు. బీఆర్ఎస్ నిర్వహించే ముఖ్య కార్యక్రమాల రోజే ఆయన మిగతా ప్రొగ్రామ్స్ కు అపాయింట్మెంట్ ఇవ్వడం గమనార్హం. తాజాగా ఖమ్మం లో  నిర్వహించే బీఆర్ఎస్ తొలి సభకు కేటీఆర్ హాజరు కావడం లేదు. కేటీఆర్ ఈనెల 14న స్విట్జర్లాండ్ వెళ్లనున్నారు. వారం రోజుల పాటు అక్కడే ఉండనున్నారు. దీంతో ఆయన మరోసారి బీఆర్ఎస్ కార్యక్రమానికి హాజరు కాకపోవడంపై ఆయనకున్న అసంతృప్తే కారణమని వినిపిస్తోంది.

తెలంగాణ వాదంతో టీఆర్ఎస్ ను  ప్రజల్లోకి  తీసుకెళ్లిన కేటీఆర్ ఎక్కడా బీఆర్ఎస్ గురించి మాట్లాడడం లేదు.  ఒకప్పుడు తెలంగాణ కోసమే తమ పార్టీ అని నినాదాలు చేసి.. ఇప్పుడు బీఆర్ఎస్ ను ఆదరించండి.. అని ప్రజలను అయోమయానికి గురిచేయడం తనకు ఇష్టం లేదన్నట్లు తెలుస్తోంది. ఇటీవల కేటీఆర్ ఎక్కడ సమావేశం నిర్వహించినా కేంద్రంపై రుసరుసలాడుతున్నాడే తప్ప.. బీఆర్ఎస్ గెలుస్తుందని ఒక్కమాట చెరప్పడం లేదు. మరోవైపు అంతకుముందు ప్రతీ ప్రాధాన్యం ఉన్న కార్యక్రమాల్లో తండ్రీ కొడుకులు వేదికపై కనిపించారు. కానీ బీఆర్ ఎస్ గా మారిన తరువాత కేసీఆర్, కేటీఆర్ ఒకే వేదికపై దాదాపు కనిపించడం లేదు.  ఇందుకు ఆయన బీఆర్ఎస్ పార్టీపై ఏమాత్రం ఇష్టం లేదనడానికి ఇదే నిదర్శనం అని అంటున్నారు.

కేటీఆర్ మాత్రమే కాకుండా ఆ పార్టీలోని చాలా మంది నాయకులు బీఆర్ఎస్ గా మారడంపై అసంతృప్తితో ఉన్నారు. తెలంగాణ ప్రజల్లో తెలంగాణ వాదం బాగా పాతుకుపోయింది. అందుకనే ఇతర పార్టీల్లోని నాయకులు టీఆర్ఎస్ లో చేరారు. ఇలా మారడంపై ప్రజలు కూడా హర్షించారు. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ మారిన తరువాత ప్రజల్లోకి వెళితే ఎదురుదెబ్బలు తగిలే అవకాశం ఉందని అనుకుంటున్నారు. కేసీఆర్ ఏ ప్రయోజనం కోసం బీఆర్ఎస్ గా మార్చాడో తెలియదు గానీ.. దీంతో తమనకు ఎక్కువగా నష్టం జరిగే అవకాశం ఉందని పలువురు నేతలు భావిస్తున్నారు. అందువల్లే చాలా మంది మంత్రులు సైతం బీఆర్ఎస్ కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొనడం లేదు.

ఈనెల 18న నిర్వహించే ఖమ్మం సభ బాధ్యతలను ఆ పార్టీ నేత తుమ్మల నాగేశ్వర్ రావుకు అప్పగించారు. ఆ జిల్లాలో మంత్రి పువ్వాడ ఉన్నా.. ఆయనను కాదని తుమ్మలకు అప్పగించడంపై రకరకాలుగా అనుకుంటున్నారు. ఇప్పుడున్న కొంత మంది మంత్రులు బీఆర్ఎస్ పై అసంతృప్తిగా ఉన్నారని, దీంతో సభ ఫెయిల్యూర్ అయ్యే అవకాశం ఉందనే ఉద్దేశంతోనే తుమ్మల నాగేశ్వర్ రావుకు అప్పగించారు. రానున్న రోజుల్లో కూడా కొంత మంది మంత్రుల విషయంలో కేసీఆర్ ఇదే పాటించే అవకాశం లేకపోలేదని అనుకుంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    
  • Telangana 
  • KCR 
  • KTR 
  • NameChange 
  • TRS 
  • BRS 
  • LatestNews 
  • Politics 
  • PoliticalNews 
  • TupakiNews 

Similar News

ఆధార్ ప్లేసులో ఓటర్ ఐడీ.. కేంద్రం మరో దుమారం?

2026-11-05 16:15 GMT

పాక్ పై కొట్టింది కానే కాదట.. విరాట్ కోహ్లీ బెస్ట్ వన్డే ఇన్నింగ్స్ లు ఏవో తెలుసా?

2026-11-05 16:14 GMT

ఏపీ ఎన్నిక‌ల్లో ఒక విషాదం.. మ‌రిన్ని చిత్ర విచిత్రాలు!

2026-11-05 16:12 GMT

'దేశ ద్రోహం': మోడీ రేపిన 'రాహుల్ మంట‌లు'!

2026-11-05 16:11 GMT

చెవిరెడ్డ‌న్నా.. గొడ‌వ‌లు వ‌ద్దు.. టీడీపీ నేత బిగ్ ఆఫ‌ర్‌!

2026-11-05 16:09 GMT

అనంత‌లో తేడా ఎక్క‌డ కొట్టింది.. బాబు ఆరా.. !

2026-11-05 13:30 GMT

ఎన్నికలా..? ఏకపక్ష ఎంపికలా..? జగన్ ఆరోపణలతో మళ్లీ రాజకీయ దుమారం

2026-11-05 12:50 GMT

ఫుట్ బాల్ లో మరో లెజెండ్ రిటైర్ మెంట్

2026-11-05 12:34 GMT

చీప్.. వెరీ చీప్..పాకిస్తాన్ లో బంగారం ఎంత తక్కువనో తెలుసా?

2026-11-05 12:19 GMT

వ్యాపారంలోనూ కోహ్లీ కింగ్.. రూ. 1,600 కోట్ల సామ్రాజ్యం వెనుక అసలు కథ ఇది

2026-11-05 10:10 GMT

కాంగ్రెస్‌లో క్రమశిక్షణకు పరీక్ష

2026-11-05 10:01 GMT

డేటింగ్ నుంచి వివాహం వరకు.. నేటి యువత మైండ్‌సెట్‌పై ప్రభుత్వం ఫోకస్!

2026-11-05 08:08 GMT

Copyright @2026

Powered by Blink CMS