• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  కేజ్రీ ‘లోపలి’ కోణాన్ని...

కేజ్రీ ‘లోపలి’ కోణాన్ని బయటపెట్టిన సిద్ధూ

By - Tupaki Desk
Update: 2016-09-08 16:14 GMT
ఎంతటి సంచలన విజయాన్ని సొంతం చేసుకున్నారో.. అంతే వివాదాస్పద అంశాల్ని నిత్యం చుట్టుకునే ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పై తాజాగా మరో ఆరోపణలో చిక్కుకున్నారు. ఇప్పటికే పలు విమర్శలు.. ఆరోపణల మధ్య నలుగుతున్న కేజ్రీవాల్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు అవాజ్ – ఇ – పంజాబ్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ.

ఆ మధ్యన బీజేపీ ఇచ్చిన రాజ్యసభ పదవిని వదులుకొన్న సిద్ధూ.. పార్టీకి సైతం గుడ్ బై చెప్పారు. ఆ సందర్భంగా సిద్దూ ఆమ్ ఆద్మీ పార్టీలోకి చేరుతారన్న అభిప్రాయం వ్యక్తమైంది. అంతేకాదు.. ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా సిద్ధూను అభివర్ణించినోళ్లు చాలామందే ఉన్నారు. అయితే అవేమీ నిజం కావన్నట్లుగా సిద్ధూ కొత్తగా ఒక పార్టీని షురూ చేశారు. ఇదిలా ఉంటే.. తాజాగా కేజ్రీవాల్ పై సిద్ధూ చెప్పిన లోగుట్టు అంశాలు షాకింగ్ గా మారాయి.

చంఢీగఢ్ లో విలేకరుల సమావేశాన్ని నిర్వహించిన ఆయన.. తాను రాజ్యసభ సభ్యత్వం వదులుకున్నది కేజ్రీవాల్ కోసం కాదన్న ఆయన మరో పిడుగులాంటి మాటను చెప్పారు. ఢిల్లీ ముఖ్యమంత్రిని తాను కలిసినప్పుడు ఆయన ట్వీట్ చేశారని.. ఈ సందర్భంగా సగం నిజాలు మాత్రమే చెప్పారని.. మిగిలిన సగం తాను చెబుతానన్న ఆయన.. తనను కేజ్రీ పోటీకి దిగకూడదని చెప్పినట్లుగా చెప్పారు.

అంతేకాదు.. పంజాబ్ ఎన్నికల్లో తన భార్యను పోటీలోకి దించితే ఆమెకు మంత్రి పదవిని ఆఫర్ చేసినట్లుగా చెప్పారు. ఈ ఆఫర్ కు తానో నమస్కారం పెట్టానని చెప్పారు. కేజ్రీవాల్ కు తన అడుగులకు మడుగులొత్తేవారే కావాలని.. ప్రజలకు ప్రజాసేవ చేయాలని భావించే వారిని ఆయన పక్కన పెడతారంటూ విమర్శలు గుప్పించారు. ‘‘మంచివాళ్లను అలంకరణ వస్తువులుగా ఉంచి.. ఎన్నికల ప్రచారంలో వాడుకోవటం దేశంలో కొంతకాలంగా వస్తున్న ఆచారం’’ అంటూ సూటిగా.. ఘాటైన విమర్శల్ని చేసి ‘సామాన్యుడి’ గుండెల్లో బాంబులు పేల్చినంత పని చేశారు సిద్ధూ.
Tags:    
  • Sidhu 
  • Awaaz-e-Punjab 
  • Kejriwal 

Similar News

ఆధార్ ప్లేసులో ఓటర్ ఐడీ.. కేంద్రం మరో దుమారం?

2026-11-05 16:15 GMT

పాక్ పై కొట్టింది కానే కాదట.. విరాట్ కోహ్లీ బెస్ట్ వన్డే ఇన్నింగ్స్ లు ఏవో తెలుసా?

2026-11-05 16:14 GMT

ఏపీ ఎన్నిక‌ల్లో ఒక విషాదం.. మ‌రిన్ని చిత్ర విచిత్రాలు!

2026-11-05 16:12 GMT

'దేశ ద్రోహం': మోడీ రేపిన 'రాహుల్ మంట‌లు'!

2026-11-05 16:11 GMT

చెవిరెడ్డ‌న్నా.. గొడ‌వ‌లు వ‌ద్దు.. టీడీపీ నేత బిగ్ ఆఫ‌ర్‌!

2026-11-05 16:09 GMT

అనంత‌లో తేడా ఎక్క‌డ కొట్టింది.. బాబు ఆరా.. !

2026-11-05 13:30 GMT

ఎన్నికలా..? ఏకపక్ష ఎంపికలా..? జగన్ ఆరోపణలతో మళ్లీ రాజకీయ దుమారం

2026-11-05 12:50 GMT

ఫుట్ బాల్ లో మరో లెజెండ్ రిటైర్ మెంట్

2026-11-05 12:34 GMT

చీప్.. వెరీ చీప్..పాకిస్తాన్ లో బంగారం ఎంత తక్కువనో తెలుసా?

2026-11-05 12:19 GMT

వ్యాపారంలోనూ కోహ్లీ కింగ్.. రూ. 1,600 కోట్ల సామ్రాజ్యం వెనుక అసలు కథ ఇది

2026-11-05 10:10 GMT

కాంగ్రెస్‌లో క్రమశిక్షణకు పరీక్ష

2026-11-05 10:01 GMT

డేటింగ్ నుంచి వివాహం వరకు.. నేటి యువత మైండ్‌సెట్‌పై ప్రభుత్వం ఫోకస్!

2026-11-05 08:08 GMT

Copyright @2026

Powered by Blink CMS