కేంద్రానికి పెట్రోల్, డీజిల్ పై షాకింగ్ ఆదాయం
రోజుకో పది పైసలు.. అప్పుడప్పడుు పావలా.. అలా పెరుగుతూ.. ఎప్పుడో ఒకటి అరా తగ్గే పెట్రోల్.. డీజిల్ ధరల గురించి ప్రజలు పట్టించుకోవటం మానేశారు. బాదుడు అనివార్యం అయినప్పుడు నోరు మూసుకొని భరించటం తప్పించి ఇంకేం చేయగలమన్నట్లుగా తీరు ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధర తక్కువగా ఉన్నప్పటికీ.. దేశంలో కేంద్ర.. రాష్ట్ర ప్రభుత్వాలు బాదేస్తున్న బాదుడుతో.. సగటు జీవికి మాత్రం షాకుల మీద షాకులిస్తోంది.
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో లీటరు పెట్రోల్ రూ.82 ప్లస్ (తెలంగాణతో పోలిస్తే ఏపీలో మరికాస్త ఎక్కువ).. లీటరు డీజిల్ రూ.78 ప్లస్ గా ఉంది. చాలా తక్కువ వ్యవధిలోనే లీటరు రూ.80ను టచ్ చేసే రోజు వచ్చేసినట్లేనని చెప్పక తప్పదు. చరిత్రలో లీటరు డీజిల్ రూ.80కు ఇప్పట్లో రాదనుకున్న వారందరికి.. నిరాశ కలిగించేలా అంతకంతకూ పెంచేస్తున్నారు. బతుకు బండికి కీలకమైన పెట్రో బాదుడు పుణ్యమా అని ధరలు కొండెక్కి కూర్చుంటున్న పరిస్థితి.
అంతర్జాతీయ మార్కెట్ లో బ్యారెల్ ముడిచమురు 44 డాలర్లకు లభిస్తుంటే.. బాదుడు మాత్రం భారీగా ఉంది. ఈ విషయానికి సంబంధించి చిన్న పోలికతో.. బాదుడు రేంజ్ ఎంతలా ఉందనటానికి ఈ గణాంకాలు ఇట్టే చెప్పేస్తాయి. 2014లో అంతర్జాతీయ మార్కెట్ లో ముడి చమురు బ్యారెల్ ధర 106 డాలర్లు ఉండేది. ప్రస్తుతం ఉన్నది 44 డాలర్లే. కొంతకాలం క్రితం బ్యారెల్ ముడిచమురు 29 డాలర్ల కనిష్ఠస్థాయికి పడిపోయింది. అయినప్పటికీ పెట్రోల్.. డీజిల్ ధరలు తగ్గకపోవటం గమనార్హం.
2014లో పెట్రోల్ ధర రూ.65-70 మధ్య ఉంటే.. డీజిల్ 55-59 మధ్య ఉండేది. సాధారణంగా ముడిచమురు ధర పెరిగితే పెట్రోల్.. డీజిల్ ధరలు పెంచుతారు. కానీ..ఇప్పుడు రివర్సులో.. పై మార్కెట్లో ధరలు తగ్గుతున్నా.. ఇక్కడ మాత్రం అంతకంతకూ పెంచేస్తున్నారు. ఎందుకలా? అంటే.. పెట్రోల్.. డీజిల్ పై వేసే పన్నులతో భారీ ఎత్తున ఆదాయాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పంచుకుంటున్నాయి.
రాష్ట్రాలతో పోలిస్తే.. కేంద్రం పన్ను వాటానే భారీగా ఉందన్నది ఒప్పుకోవల్సిందే. 2014-15లో పెట్రోల్.. డీజిల్ మీద కేంద్రానికి వచ్చే ఆదాయం రూ.99వేల కోట్లు ఉంటే.. 2016-17 నాటికి ఆ ఆదాయం రూ.2.42లక్షల కోట్లకు చేరుకుంది. ఈ ఏడాదికి అది 3 లక్షల కోట్లకు పెరిగే ఉంటుంది. ఇంత భారీగా ప్రజల జేబులకు చిల్లు పెట్టేస్తున్నారు. ఇది సరిపోక.. ఇప్పుడు మరింత ధరల్ని పెంచుతున్న తీరు చూస్తే.. నోట మాట రాదంతే. నీతులు చెప్పే కేంద్ర..రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రజల మీద నిజంగా ప్రేమ ఉంటే.. పెట్రో ఉత్పత్తులపై వసూలు చూస్తున్న భారీ పన్ను బాదుడ్ని సగానికి తగ్గించినా.. చాలానే మార్పులు వస్తాయని చెప్పక తప్పదు. బాదుడుకు అలవాటు పడి.. భారీ ఆదాయాన్నిసొంతం చేసుకుంటున్న ప్రభుత్వాలు.. ప్రజల గురించి ఆలోచిస్తాయా?