పట్టపగలు చెన్నై నడిబొడ్డున ఆ కుర్రాడ్ని వెంటాడి చంపేశారు

Update: 2020-09-25 05:00 GMT
చెన్నై మహానగరంలో దారుణం చోటు చేసుకుంది. సినిమాల్లో చూపించే క్రైం సీన్ కు మించినట్లుగా హత్య చోటు చేసుకుంది. పట్టపగలు.. అందరూ చూస్తుండగా ఒక యువకుడ్ని దారుణంగా చంపేసిన వైనం షాకింగ్ గా మారింది. చెన్నై మహానగరంలోని రాణిపేట్ లోని అరక్కోణం కొత్త బస్టాండ్ కు వెళ్లాడు 28 ఏళ్ల గోకుల్.

అక్కడకు చేరుకున్న అతగాడిపై నలుగురు వ్యక్తులు దాడికి దిగారు. భయంతో పరుగులు తీస్తున్న గోకుల్ ను వెంటాడి మరీ చంపేశారు. రక్తపు మడుగులో కొట్టుమిట్లాడుతున్న అతడు మరణించాడని నిర్దారించుకున్న తర్వాతే అక్కడి నుంచి నిందితులు పరారీ కావటం గమనార్హం. అతడ్ని హత్య చేసిన ఉదంతానికి సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ పుటేజ్ లో రికార్డు అయ్యాయి.

ఈ ఘటనతో స్థానికుల్లో ఒక్కసారిగా కలకలం రేగింది. సమాచారం అందుకున్న పోలీసులు గోకుల్ డెడ్ బాడీని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. సీసీ కెమేరాల్లో నిక్షిప్తమైన వీడియో ఆధారంగా హంతకుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అతడి మర్డర్ వెనుక ఉన్న అసలు కారణం ఏమిటన్నది ఇప్పటివరకు వెల్లడికాలేదు. ఈ హత్యోదంతం స్థానికంగా సంచలనంగా మారింది.
Tags:    

Similar News